Site icon Prime9

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు( ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు) ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in Telugu, 2025 February 23 to March 1: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం: మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్లాలనుకునే వారు మే నెలలోపు ప్రయత్నాలు చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం. కొంతమందికి వీసా విషయంలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విషయంలో హెచ్ వన్ బి వీసా విషయంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, నూతన ఉద్యోగం కానీ లభిస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడండి. శత్రువర్గం పెరిగే అవకాశం ఉంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వారికి మీ సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సినిమా రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఫ్యాషన్ డిజైనింగ్ మరియు వస్త్ర వ్యాపారులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు వర్గాలలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ మాట తీరుతో, మంచితనంతో అందరిని ఆకట్టుకోగలుగుతారు. ముక్కుసూటి తనంతో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీ వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోరు. నలుగురిలో మీకంటూ ఒక స్థానం స్థాయిని సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు నిత్యం కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.

వృషభం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉండవచ్చు. కెరీర్ పరంగా ,వ్యాపారపరంగా కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శుభకార్యాల విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రూపు వన్ పరీక్షలకు మరియు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కీలక విషయాలలో సొంత నిర్ణయాలే మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో పారాధన చేయండి. ప్రతిరోజు ఇంట్లో హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే రంగు ఎరుపు..

మిథునం: మిథున రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఏ పని చేసినా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇంట బయట కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అమ్మకాలు కొనుగోలు లాబిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన0 విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అకౌంట్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానంకలుగుతుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతా అన్ని విషయాలు బాగుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఈ వారం లభించే పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది, కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టిన గాని గణపతి స్వామి వారికి అభిషేకం చేయించి ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ..

కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా లేదు. ఈ రాశికి కి అధిపతి అయినటువంటి చంద్రుడు షష్టమంలో ఉన్నారు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. సోమవారం రోజున రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ మార్పులు ఉంటాయి. విలాసాలకు వినోదాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు వైట్.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంటా బయట కూడా చెప్పుకోతగిన స్థాయిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి మీపై అంత ప్రభావాన్ని చూపించవు. అమ్మకాలు కొనుగోలు లాబిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కుటుంబంలో సఖ్యత లోపించే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. శుభకార్యాల నిర్వహణ కోసం ఖర్చు అధికంగా చేస్తారు. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి, కలిసి వచ్చే రంగు తెలుపు..

కన్య: కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధమైన విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు పెరిగి విడాకుల వరకు దారి తీసే పరిస్థితి గోచరిస్తుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే. భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం కృషి చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు కష్టపడి చదవాల్సిన సమయం కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. భూమి కొనుగోలు చేయాలి లేదా గృహం కొనుగోలు చేయాలి అన్న మీ చిరకాల కోరిక ఈ వారం నెరవేరుతుంది. ప్రేమ వివాహాలు వివాదాస్పదం అవుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు కొన్న స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది. కోర్టు పరంగా రావాల్సిన తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయండి. మెడలో సుబ్రహ్మణ్యస్వామి వారి రూపును ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8 కలిసి వచ్చే రంగు ఎరుపు.

తుల: తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాలకు గ్రహగతులు అంత అనుకూలంగా లేవు వివాహం జరుగుతుందా లేదా అన్న విషయం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెప్పాలి మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు అయితే మీ వైపు తొంగి కూడా చూడరు ఇది మీ మానసిక అశాంతికి కారణం అవుతుంది. చాలా విషయాలలో మీ కృషి వ్యక్తం కాదన్నా సంగతి చాలా సందర్భాలలో రుజువు అవుతుంది. మీ మీద అతిగా ఆధారపడిన వ్యక్తులను దారిలో పెట్టండి. అందరిని నమ్మి నూతన పెట్టుబడులు పెట్టడం అనేది చెప్పదగిన విషయం కాదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా బాగుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలని గ్రహిస్తారు. కొత్త కొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా గాని శుభకార్యాలు మాత్రం పూర్తవుతాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కీళ్ల నొప్పులు గ్యాస్టిక్ సమస్యలు ఎలర్జీ వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కోర్టు సంబంధమైన తీర్పులు మీకు అనుకూలంగా వచ్చిన దానివల్ల ఇప్పటికిప్పుడు ప్రయోజనం ఏమీ ఉండదు. విదేశీయాన సంబంధమైన విషయాలు రెండవ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు కాషాయం.

ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మునుపటి వారం కంటే బాగుందని చెప్పవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని యోజన చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీకు మీరుగా చేసే వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబపరమైన సమస్యలను అధిగమిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దైవానుగ్రహం ఉన్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మిత్రుల సహాయ సహకారం వల్ల మానసిక ప్రశాంతతను కొంతమేర పొందగలుగుతారు. విలువైన వస్తువులను వాయిదా పద్ధతులలో కొనుగోలు చేస్తారు. రాజకీయ సాంస్కృతిక కళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కష్టేఫలి అన్నట్లుగా ఉంటుంది కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపును మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5, కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం: మకర రాశి వారికి ఈ వారం నామమాత్రపు ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చికాకులు ఏర్పడతాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. నూతన అవకాశాలు లాబిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రజా సంబంధాలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. వ్యాపారపరంగా సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని నష్టం రాకుండా జాగ్రత్త పడతారు. నూతన పెట్టుబడులు పెడతారు. దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలు మాత్రం పదిలంగా ఉంటాయి. సంతానం విషయంలో దీర్ఘ ఆలోచనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆహార సంబంధిత వ్యాపారాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు దానివల్ల కొన్ని చికాకులు ఏర్పడతాయి. రాజకీయరంగంలో రాణిస్తారు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ కొన్నిచోట్ల తగ్గుతుంది కొన్ని చోట్ల పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. పరపతినీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఇన్సూరెన్స్ విషయంలో అశ్రద్ధ ఎంత మాత్రం పనికిరాదు. జీవితంలో ఒక ముఖ్య విషయానికి సంబంధించి మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు వ్యాపార పరంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. యోగా మెడిటేషన్ చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కడుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆర్థిక భారం అనేది తొలగిపోతుంది. వివాహది శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి, అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

మీనం: మీనరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగులపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అనే మనోవేదన ఉంటుంది. కొంతమంది ఆత్మీయులతో విడిపోవడం మరి కొంతమంది కొత్త వ్యక్తులతో కలవడం అనేది జరుగుతుంది ఒక్క వర్గానికి దూరం అవుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పాల వ్యాపారం నీళ్ల వ్యాపారం బేకరీ వ్యాపారం హోటల్ వ్యాపారం చేసే వాళ్లకు కాలం అనుకూలంగా ఉంది. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకొని చాలామందికి దూరమవుతారు. ఏది ఏమైనా వివాహపరంగా మీ సొంత నిర్ణయాలు మీ జీవితానికి మేలు చేయవు. ఇతరుల మనసు ఆంతర్యం తెలుసుకునే విషయంలో విఫలం చెందుతారు. చాలా విషయాలలో కఠినంగా ప్రవర్తించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని నాకే తెలుసు అన్న ధోరణిని పక్కన పెట్టండి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. బందు వర్గంలో కానీ మిత్రవర్గంలో కానీ విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

Exit mobile version
Skip to toolbar