Breaking News

మా పొరపాటుకు క్షమించండి.. తిరుమల వివాదం పై విఘ్నేష్ శివన్

11 th Jun 2022, UTC

దర్శకుడు విఘ్నేష్ శివన్ మరియు నటి నయనతార జూన్ 9న వివాహం చేసుకుని నిన్న తిరుమలకు వచ్చారు. ఈ జంట చెప్పులతో మాడవీధిలో నడవడం వివాదానికి దారితీసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దీనికి సంబంధించి వివరణ కోరుతూ విఘ్నేష్ శివన్, నయనతారలకు నోటీసులు జారీ చేసింది.

తాజాగా ఈ వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్‌ ఓ లేఖ రాశారు. భగవంతుడిపై మాకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. తిరుమలలో స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాం. అదే పనిపై గడచిన నెల రోజుల్లో ఐదుసార్లు కొండకు వచ్చాం. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి మహాబలేశ్వరంలో జరిగింది. పెళ్లి వేదిక నుంచి నేరుగా తిరుమల చేరుకున్నాం. స్వామి కల్యాణం వీక్షించి శుక్రవారం ఆశీస్సులు పొందాం. దర్శనం తర్వాత మా పెళ్లి ఇక్కడే జరిగిందన్న భావన కోసం, లైఫ్‌టైమ్‌ మాకు గుర్తుండేలా స్వామి ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ చేసుకోవాలనుకున్నాం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి నుంచి వెళ్లి పోయి మళ్లీ తిరిగి వచ్చాం. త్వరగా ఫొటోషూట్‌ పూర్తి చేయాలనే కంగారులో కాళ్లకు చెప్పులు ఉన్నాయనే సంగతి మరచిపోయాం. మేము భక్తితో కొలిచే ఆ స్వామి అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయనను అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మా వల్ల జరిగిన పొరపాటుకు క్షమించమని కోరుతున్నాం అని విఘ్నేశ్‌ శివన్‌ తన లేఖలో రాసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox