Site icon Prime9

Tulsi : తులసి వివాహం రోజున ఖచ్చితంగా పాటించాలిసిన పరిహారాలు ఇవే

tulasi prime9news

tulasi prime9news

Tulsi Vivah 2022: ప్రతి ఏడాది  తులసి పూజను ఏకాదశిని కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. తులసి వివాహం తర్వాత రోజున ద్వాదశి  వేడుకలు జరుపుకుంటారు.ఐతే ఈ ఏడాది  నవంబర్ 4 న దేవుత్తని ఏకాదశి జరుపుకుని నవంబర్ 5 న తులసి కళ్యాణం వైభవంగా జరుపుకుంటారు.ఇతే  ఈ కళ్యాణంలో భాగంగా తులసిని పూజించడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

తులసి వివాహం రోజున ఖచ్చితంగా పాటించాలిసిన పరిహారాలు ఇవే:
తులసి వివాహానికి ముందు రోజూ పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.ఇవి మాత్రమే కాకుండా కొన్ని తులసి ఆకులను తీసి నీటిలో వేసి, ఈ నీటి తొట్టిని తులసి కళ్యాణం రోజున ఇంటి ద్వారం వద్ద పెట్టాలిసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భర్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. అంతేకాకుండా వీరి మధ్య ప్రేమ బంధం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే తులసి కళ్యాణం రోజున తులసికి చేసే అలంకరణను, నైవేద్యాన్ని స్త్రీలకు దానం చేయాలిసి ఉంటుంది. ఇలా తులసి కళ్యాణం రోజున ఈ నియమాలు పాటిస్తే భార్యభర్తల మధ్య ఉన్న గొడవలు మొత్తంగా దూరమవుతాయి.అంతే కాకుండా భర్తపై ప్రేమ కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు.

Exit mobile version