Breaking News

కరుణించిన వెంకన్న..ఎట్టకేలకు నేటినుంచి దర్శనాలు..తొలిరోజు ఇలా...

08 th Jun 2020, UTC
కరుణించిన వెంకన్న..ఎట్టకేలకు నేటినుంచి దర్శనాలు..తొలిరోజు ఇలా...
జూన్ ఎనిమిది నుంచి ఆలయాలకు అనుమతులు ఇవ్వడం తో.. ఎట్టకేలకు దేవాలయాలు ప్రార్ధన మందిరాలు తెరుచుకున్నాయి. దాదాపు రెండున్నర నెలల తర్వాత దైవ దర్శన భాగ్యం కలగడం తో... భక్తులంతా దేవాలయాలకు క్యూ కడుతున్నారు. నిత్యా కళ్యాణం పచ్చ తోరణ గా వెలిగే తిరుమల రెండు న్నర నెలలపాటు బోసిపోయి ఉంది.. నేటి నుంచి ఆలయాలకు అనుమతులు ఉండడం తో..తిరుగిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు పూర్తి చేస్తూ భక్తులను అనుమతిస్తున్నారు. 
          అయితే... కరోనా మహమ్మారి నేపధ్యం లో టీటీడీ తొలి రెండు రోజులు ట్రయల్స్ కి కేటాయించింది. సాధారణ భక్తులను అనుమతించే కంటే ముందు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించారు.  దీంట్లో భాగంగా అలిపిరి నుంచి శ్రీవారి సన్నిధి వరకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. తొలి రోజు ప్రయోగత్మకంగా సిబ్బంది కుటుంబ సభ్యులు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి సన్నిధానంలోకి పంపిస్తున్నారు. 
       ఈ ట్రయల్స్ పూర్తి అయ్యాక జూన్‌ 11 నుంచి సాధారణ భక్తులను  కూడా అనుమతిస్తారు. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు దర్శనాలకు దర్శనాలకు అనుమతించేటట్లు ఏర్పాట్లు చేసారు. రోజుకు ఆరు వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దర్శన టోకెన్లు ఇస్తున్నారు. ఈరోజు ఉదయం పది గంటలనుంచి ఈ టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు దగ్గరగా సేవలందించే సిబ్బందికి పీపీఈ కిట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox