Horoscope: నేడు పలు రాశుల వారికి ఆర్థికంగా కలిసివచ్చి అదృష్ట యోగం పడుతుంది. మరి 16 గురువారం 2023 ఏఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలన్నాయో తెలుసుకుందాం.
మేషం: నేడు ఈ రాశి వారికి ఉద్యోగంలో పని భారం మీద పడుతుంది. ఇంటాబయట ఒత్తిడి అధికమవుతుంది. కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం అనుకూలంగానే ఉంటుంది.
పొదుపులు చేస్తారు పెట్టుబడులు ప్రారంభిస్తారు. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. స్నేహితులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృషభం: ఉద్యోగ వాతావరణం అంతా చాలా సాఫీగా సాగిపోతుంది. ఆర్థికపరమైన సమస్యలు ఉండకపోవచ్చు. వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు చాలా అనుకూలం.
డాక్టర్లు, లాయర్లు, ఐటీవారు వారి వారి వృత్తుల్లో పురగోగతి సాధిస్తారు. చదువుల్లో పిల్లలు దూసుకుపోతారు.
మిథునం: కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. మీ వైఫ్ తరపు బంధువులు ఇంటికి వస్తారు.
కొన్ని సందర్భాల్లో స్నేహితుల వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది.
కర్కాటకం: ఉద్యోగ జీవితం యథావిధిగా సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులకు నేడు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సంబంధ విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ కనపరుస్తూ అన్ని అవసరాలను తీరుస్తారు.
సింహం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. చాలా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీ చేతికి వస్తాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కన్య: ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
తోబుట్టువులతో మనస్పర్ధలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం మంచిది.
ఈ రాశుల(Horoscope) ఉధ్యోగులు కాస్త ఒత్తిడికి గురవుతారు
తుల: కుటుంబ, ఉద్యోగ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సాఫీగానే ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోష క్షణాలను గడుపుతారు.
వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఐటీ ఉద్యోగలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ స్తోమతకు మించి ఇతరులకు హెల్ప్ చేస్తారు.
వృశ్చికం: ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. అనవసర పరిచయాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. దీర్ఘ కాలిక వ్యక్తిగత సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు: ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరాలకు తగినట్టు డబ్బు చేతికి అందుతుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో సహచరుల కాస్త ఇబ్బందులకు గురిచేస్తారు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్య పరిస్థితి సానుకూలంగానే ఉంటుంది.
మకరం: ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. పెళ్లికాని వారికి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
కుంభం: ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి. ఆర్థిక అవసరాలు కాన్ని తీరుతాయి. ఉద్యోగ పరంగా కాస్త ఒత్తిడికి గురైనా లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం బెటర్. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నేడు ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసివచ్చి అదృష్ట యోగం పడుతుంది
మీనం: ఉద్యోగంలో బాధ్యతలు పెరిగుతాయి. దానితో కాస్త ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మిత్రులతో ఆనంద క్షణాలను గడుపుతారు.