Site icon Prime9

Lakshmi Pooja On Friday: శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.

Lakshmi Pooja On Friday: ఈ లోకంలో సామాన్యుడినుంచి కోటీశ్వరులవరకు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. అయితే కొంత మందికి ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేరు. మరికొందరు సంపాదించినా వారి చేతిలో వుండదు. దీనికి లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే కారణం, లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే,మనం లక్ష్మీ దేవిని శుక్రవారం పూట పూజించాలి. మరి ఎలా పూజిస్తే, లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందో తెలుసుకోవాలి.

శుక్రవారం ఇంట్లో ఈశాన్య దిక్కున ఉన్న లక్ష్మీదేవిని ఎరుపురంగు దుస్తులు ధరించి పూజించాలి. పూజ సమయంలో, లక్ష్మీ దేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి, పూజించిన తర్వాత, ఈ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి. అనంతరం అదే రోజు సాయంత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపంలో చిటికెడు కుంకుమ పెట్టండి. ఇది సంపదను పెంచుతుంది.

అదే విధంగా ఈ రోజు మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు రంగు గాజులు మొదలైనవి దానం చేయాలి. లక్ష్మి దేవికి లడ్డులను నైవేద్యంగా సమర్పించి, అనంతరం ఆ లడ్డులను పేదవారికి, ఆకలిగా ఉన్నవారికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.


	
Exit mobile version