Breaking News

జూన్ 8 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం:వైవీ సుబ్బారెడ్డి

04 th Jul 2020, UTC

జూన్ 8 నుంచి నిబంధనలకు అనుగుణంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.టీటీడీ పాలకమండలి సమావేశం నంతరం  ఆయన మీడియాతో మాట్లాడుతూ. 6 వేల మంది భక్తులతో మొదలు పెట్టి 12 వేల వరకు సంఖ్యని పెంచామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించామని సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ నెల చివరి వరకు భక్తులు సంఖ్యని పెంచబోమన్నారు. కరోనా సమయంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకే టీటీడీ ప్రాధ్యనమిస్తోందన్నారు. ఆదాయం కోసం భక్తుల సంఖ్యని పెంచాం అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే 17 మంది టీటీడీ ఉద్యోగులు, పూజారులు, సెక్యూరిటి సిబ్బందికీ  కరోనా పాజిటివ్ వచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ఉద్యోగులలో మనోదైర్యాన్ని నింపుతామన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల భధ్రతపై చర్చించడానికి కమిటిని ఏర్పాటు చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.15 రోజుల పాటు ఉద్యోగులు తిరుమలలోనే విధులు నిర్వర్తించేలా మార్పులు చేయాలన్నారు.

తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరిక్షలు నిర్వహించిన అనంతరం అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవలు ఇప్పట్లో నిర్వహించబోమని తెలిపారు. ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం సేవను భక్తులకు అందుభాటులో తీసుకువస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox