Telugu Panchangam: సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.
నేడు దశమి తిథి సాయంత్రం 7:31 గంటల వరకు, ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది.
సూర్యోదయం: ఉదయం 6:33 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం: రాత్రి 11:42 నుంచి రాత్రి 12:26 గంటల వరకు
విజయ ముహుర్తం: మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 2:39 గంటల వరకు
అమృత కాలం: సాయంత్రం 5:35 నుంచి సాయంత్రం 7:25 గంటల వరకు
రవి యోగం: ఉదయం 6:34 నుంచి రాత్రి 12:49 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం: మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం: ఉదయం 9 నుండి ఉదయం 10:30 గంటల వరకు
యమగండం: ఉదయం 6 నుండి ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహర్తం: ఉదయం10:14 నుండి ఉదయం 10:58 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 3:23 గంటల వరకు
నేటి పరిహారం: ఈరోజు విష్ణువును పూజించి, సాయంత్రం వేళలో తులసి చెట్టుకు నీటిని సమర్పించడం చాలా మంచింది.
ఇదీ చదవండి: నాగదోషం పోవాలంటే ఇలా చేయాలి..