Breaking News

పూరి రధ యాత్ర కు బ్రేకులు వేసిన సుప్రీం..!

18 th Jun 2020, UTC

సుభద్ర బలరామ సమేత జగన్నాథుడు ఒడిశా లోని పూరి లో కొలువైన సంగతి తెలిసిందే. ఆయనకు ఏటా రథయాత్రను నిర్వహిస్తుంటారు. ఈ క్రతువు ను కొన్ని వేల సంవత్సరాలు గా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ఏడాది ఈ యాత్ర కు బ్రేక్ పడింది. ఈ సంవత్సరం పూరి జగన్నాధ స్వామి వారికి రధ యాత్రను నిర్వహించవద్దని సుప్రీమ్ కోర్ట్ అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం తో.. సుప్రీమ్ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
 
               ఓ వైపు మహమ్మారి ముప్పు ముంచుకొచ్చిందనీ.. పౌరుల ఆరోగ్య భద్రతా ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కి ఈ రధ యాత్రను రద్దు చేయాలని ఆదేశించింది. కరోనా మహమ్మారి కారణం గానే రధ యాత్ర కు సంబంధించి అన్ని కార్యకలాపాలను మానివేయాలి అని ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ పూరి జగన్నాధుడికి రధ యాత్రను నిర్వహిస్తే.. ఎక్కువ మొత్తంలో భక్త జన సందోహం హాజరవుతుందని... ఓ వైపు మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం లో.. వీరిని అదుపు చేయడం సాధ్యం అవకపోతే.. మరింత మందికి కరోనా సోకె అవకాశం ఉంటుందని సుప్రీమ్ కోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువ గా ఉన్న ఈ పరిస్థితిల్లో రధ యాత్రను నిర్వహించడం సరియన పని కాదని.. ఈ యాత్రకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.
 
             ప్రతి ఏడాది.. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాధ రధ యాత్రను ఘనం గా నిర్వహిస్తారు. ఈ రధ యాత్రకు ఎక్కడెక్కడినుంచో వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ రధ యాత్రకు చాల ప్రత్యేకతలు ఉన్నాయి.. అసలు పూరి జగన్నాధుని విగ్రహాలే ప్రత్యేకం గా ఉంటాయి. ఉత్సవ మూర్తుల్లా కాకుండా.. స్థానిక తెగలు ఆరాధించే రూపం లో పూరి జగన్నాధుడు కొలువై ఉంటాడు. ఆయన చరిత్రలో ఆదిమ జాతి వారు ఆరాధించుకున్న ప్రస్తావనలు చాలానే కనిపిస్తాయి. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకొకసారి ఈ విగ్రహాలను మారుస్తూ ఉంటారు. ఏ ఆలయం లో అయినా... మూల విరాట్టును కదల్చకుండా ఉత్సవ మూర్తుల్ని పెట్టి ఊరేగిస్తారు. కానీ.. ఈ రధ యాత్ర  లో మాత్రం.. మూల విరాట్టు విగ్రహాలనే తెచ్చి ఊరేగించడం ఆనవాయితీ. అంతే కాదు.. ఇక్కడి స్వామి వారు సతీ సమేతం గా కాకుండా.. అన్న చెల్లెళ్ళతో కలిసి గర్భాలయం లో కొలువై ఉంటారు.  
 
           ఈ రధ యాత్ర లో భాగంగా.. స్వామి వార్లు అమ్మ వార్ల విగ్రహాలను సమీపం లోని గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. ఈ మందిరం స్వామి వారి పిన్ని గారి స్వస్థలమని చెబుతుంటారు. ఇది ఆయన ఉద్యానవనమని కూడా వ్యవహరిస్తారు. ఆషాఢ శుద్ధ దశమి వరకు అక్కడే స్వామి వారు సేద దీరుతారు. ఆ తదుపరి తిరిగి స్వామి వారిని గర్భాలయానికి తీసుకురావడం తో.. ఈ రధ యాత్ర పూర్తవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox