Sri Vishnu Sahasra Nama Stotram: శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్దనల్లో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని హిందువులు పారాయణం చేస్తుంటారు. విష్ణుసహస్రనామ స్తోత్రము మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్దం అనంతరం అంపశయ్యమీద పడుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్యమరాజుకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకలవాంచితార్ద ఫలదాయకమని విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తరపీఠికలో ఈ శ్లోకం ధర్మార్దులకు ధర్మము, అర్దార్దులకు అర్దము, కామార్దులకు కామము, ప్రజార్దులకు ప్రజను ప్రసాదించునని చెప్పబడింది.
విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, పాపములు తొలగును. స్తోత్రములో ప్రతి నామము అద్భుతం. మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ, ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వుండవు. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.