Site icon Prime9

Sri Rama Raksha Stotram: కష్టాలను కడతేర్చే మంత్రం రామరక్షాస్తోత్రం

Spiritual: తండ్రి మాట కోసం సింహాసనాన్ని సైతం వదులుకున్నవాడు.. ఏకపత్నీవ్రతుడు.. సోదరులకు ఆదర్శప్రాయుడు .. పాలన అంటే రామరాజ్యంలావుండాలి. ఇవీ శ్రీరాముని గురించి ప్రపంచానికి తెలిసిన విషయం. అంతేకాదు తన శరణు జొచ్చిన వారిని , తన భక్తులను కూడ కాపాడటంలో శ్రీరాముడు ముందుంటాడు. శ్రీరామ నామ జపం గురించి దాని వల్ల కలిగే లాభాల గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది రామ కోటి కూడా రాస్తుంటారు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం రామ నార వరాననే!!

వేయి నామాలను పఠించడం వల్ల కలిగే పుణ్యం రామ శబ్దాన్ని స్మరించడం వల్ల కల్గుతుంది. రామ నామ జపం విష్ణు సహస్ర నామ పారాయణ పలితాన్ని ఇస్తుందని పరమ శివుడు పార్వతీ దేవికి వివరించాడు. రామ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు.అది సంసారాన్ని దాటించే బీజాక్షర రూప నావ.హరిని పూజించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయలో రా అనే అక్షరం, శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయలో మః అన్న శబ్దం కలిపితే రామః అనే శబ్దం రూపు దిద్దుకుంది. శివ కేశవ తత్త్వాల కలయిక రామ అనే పదంలో దర్శనమిస్తుంది.అందుకే రామ నామ జపం స్మరిస్తే పుణ్యం వస్తుందని తెలిపాడు.

రామ రక్షా స్తోత్రం పఠనం అఖండమైన తేజస్సును, వెలుగును, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రం సిద్ధ పొందడానికి శరన్నవరాత్రులు మరియు వసంత నవరాత్రుల సమయం అనువైనది. పాడ్యమి నుంచి దశమి దాక పది రోజులు, రోజుకు 11 పర్యాయములు చొప్పున పారాయణ చేసినచో మంత్ర సిద్ధి కలుగుతుంది. ఆ పైన ఏప్పుడు కావాలంటే అప్పుడు ఈ మంత్రాన్ని పఠించవచ్చు. రాముని మీద భక్తిశ్రద్దలతో రోజుకు ఒకసారి ఈ రామరక్షాస్తోత్రాన్ని చదివితే మంచి ఫలితాలను పొందుతారు.

Exit mobile version