Breaking News

శ్రీశైలం లో దర్శనాలకు అనుమతి...!

10 th Jun 2020, UTC
శ్రీశైలం లో దర్శనాలకు అనుమతి...!
కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపధ్యం లో దాదాపు రెండున్నర నెలల పాటు దేవాలయాలకు భక్తుల అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. భారత్ ఆర్థిక వ్యవస్థ ను దృష్టి లో ఉంచుకుని.. తిరిగి గాడి లో పెట్టేందుకు.. తిరిగి సడలింపులు ఇచ్చి అన్ని పనులకు అనుమతులు ఇస్తున్నారు. అయితే.. ఈ నేపధ్యం లో  జూన్ 8 నుంచి దేవాలయాలకు కూడా అనుమతులు ఇస్తున్నారు. తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఎట్టకేలకు రెండున్నర నెలల తరువాత తెరుచుకున్నాయి...
 
        తిరుమలలో భక్తుల కంటే ముందుగా స్థానికులతో ట్రైల్స్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా... శ్రీశైలం లోను భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారి దర్శనాలకు భక్తులకు అనుమతి లభించింది.  అయితే.. కరోనా మహమ్మారి నివారణ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
 
          ప్రతి ఒకరు మాస్కులు ధరించి,  సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్‌ను వినియోగిస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలి. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు రోజుకు మూడువేల మందిని ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న భక్తులను మాత్రమే అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox