Site icon Prime9

Sai Baba Pooja: అన్నదానం.. పాలకోవా నైవేద్యం.. ఇవీ సాయిబాబాకు ఇష్టమైనవి.

Spiritual: గురువారం సాయి బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు, పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా, ఆ చిన్న పిల్లలతో కొంత సేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపను పొందచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టమట. అదేవిధంగా గురువారం రోజున బాబా పేరిట పేరిట అన్నదానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.

గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అదే విధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా. బాబాకు జీవ హింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా బాబాకు ఇష్టమైన రోజున పై నియమాలను పాటించడం ద్వారా సాయి బాబా కృప మీపై ఎప్పుడూ ఉంటుంది.

Exit mobile version