Breaking News

14 నుంచి తెరుచుకోనున్న శబరిమల..!

06 th Jun 2020, UTC
14 నుంచి తెరుచుకోనున్న శబరిమల..!
అయ్యప్ప స్వామి దేవాలయం కేరళలోని సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల దేవాలయం ఈ నెల 14 వ తేదీన తెరుచుకోనుంది. మలయాలం మాసమైన మిథునం 15నుంచి ప్రారంభంకానుండడంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, శబరిమల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 28వరకు ఆలయాన్ని తెరువనున్నట్లు దేవస్థానం మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు. క్యూ పద్ధతిలో గంటకు యాభై మంది కి మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. మాములు గా.. ఈ మాసం లో దర్శనానినికి గంటకి రెండొందల మంది భక్తుల వరకు అనుమతులు ఇచ్చేవారు.. ప్రస్తుతం.. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ సంఖ్యని యాభై మందికే కుదించారు. ఉదయం 4నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని దేవాలయాధికారులు తెలిపారు. 
          అయితే.. కేరళ కాకుండా.. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వారు.. "కొవిడ్‌ జాగ్రత్త రిజిస్ట్ట్రేషన్‌ పోర్టల్లో" ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమకు ఎలాంటి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్స్‌ లేవని నిర్ధారిస్తూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ల్యాబ్‌ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని పోర్టల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని, పంపా వరకే వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. పంపా వద్ద భక్తులను తనిఖీ చేసిన తరువాత..పంపిస్తారని చెప్పారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. విశ్రాంత సమయం లో అనువుగా.. పరిసరాల్లో కూడా శానిటైజషన్ చర్యలు చేపడతామని చెప్పారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox