Site icon Prime9

Ramakoti: రామకోటి రాయడానికి నియమాలు ఏమిటో తెలుసా ?

Spiritual: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే ‘రామ’ అనే పేర్లు కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో ఉంది. ‘రామకోటి’ రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు.

రామకోటి అంటే శ్రీరామ అనే పదాన్ని కోటి సార్లు రాయడం. శ్రద్ధాభక్తులు ఉన్నవారు ఎవరైనా దీన్ని రాయవచ్చు. రాసిన తరువాత శ్రీరామాలయాలలో లేదా ఇతర పుణ్య క్షేత్రాలలో రామకోటి పుస్తకాలు భద్రపరిచే చోట సమర్పించి వస్తారు. తెలుగువారికి భద్రాచలం ముఖ్యమైన రామక్షేత్రం కాబట్టి సాధారణంగా ఇక్కడ సమర్పించి వస్తారు. అక్కడి మూల మూర్తులకు అభిషేక పూజాదులు నిర్వహించి, పుస్తకాలను పూజిస్తారు. కోటి పూర్తయిన తర్వాత కూడా జీవిత పర్యంతం రాసేవారున్నారు.

రామకోటి రాయడానికి నియమాలు ఇవే..

రామకోటి వ్రాయడం ప్రారంభించే ముందు రామునికి పుజచేసి ప్రారంభించాలి.
రామకోటి రాసేవారు ఎదురుగా సీతారాముల చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుని నోటితో ఉచ్ఛరిస్తూ రాయాలి దీనివల్ల మానసిక, కాయిక, వాచిక జపం చేసినట్లు అవుతుంది
శుచి శుభ్రతలు (స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి) కలిగి ఉండాలి.
రాసేటప్పుడు దిక్కలు చూస్తూనో అనవసరమైన మాటలు మాట్లాడటమో చేయకూడదు.
నేలపై కూర్చుని, పడుకుని రాయకూడదు
నల్లరంగు సిరా వాడకూడదు. నీలం కానీ ఆకు పచ్చ రంగు కానీ మంచివి.
పద్మాసనం వేసుకుని కూర్చుని రాయాలి
అంటు, మైల, పురుడు ఉన్న రోజులలో రాయకూడదు.
రామకోటి పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభించి అదే నక్షత్రం రోజు ముగిస్తే మంచిది.
ప్రతిరోజూ కనీసం 108కి తక్కువ కాకుండా రాయాలి
పూర్తి చేసిన రోజు అన్న సంతర్పణ చేయడం మంచిది.

Exit mobile version