Lord Ganesha: విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడిని ధి విధానాలతో పూజిస్తే, అన్ని కష్టాలు తొలగిపోతాయి. బుధుడు బలహీనంగా ఉంటే, బుధవారం గణేశుడిని పూజించాలి. దీనివల్ల బుధదోషం తొలగడమే కాకుండా శారీరక, ఆర్ధిక, మానసిక ఇబ్బందులుంటే దూరమౌతాయి.
బుధవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం ముగించుకుని పూజ ప్రారంభించాలి. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవాలి. గణేశుడికి సింధూరం తిలకంగా పెట్టాలి. ఆ తరువాత గణేశుడికి పుష్పం, ధూపం, దీపం, కర్పూరం, చందనం అర్పించాలి. చివరిగా గణేశుడికి హారతిచ్చి, గణేశ మంత్రం పఠించాలి. ఇలా భక్తిశ్రద్ధలతో చేస్తే గణేశుని కృపకు పాత్రులవుతారు.
గణేశుడిని పూజించిన తరువాత పేదలకు పెసరపప్పు, పచ్చని వస్త్రాలు దానం చేయాలి. అదేవిధంగా బుధవారం ఆవులకు మేత తినిపించడం వల్ల కూడ కష్టాలు దూరమవుతాయి. తలపెట్టిన పనులు విఘ్నాలు లేకుడా పూర్తవుతాయి.