Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( మంగళవారం సెప్టెంబర్ 6, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( మంగళవారం సెప్టెంబర్ 6, 2022 )

1. మేష రాశి

ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త వింటారు. మీరు అప్పు ఇచ్చి ఉంటే మీ దగ్గరికి ఆ డబ్బు చేరుతుంది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీకు సహాయం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2. వృషభ రాశి

పని చేసే దగ్గర ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కోపం తగ్గించుకోండి అది మంచిది కాదు .మీ ప్రేమ ప్రయాణంలో కొత్త చిక్కులు వస్తాయి. ఈ రోజు మీరు చేయాలనుకున్న పనులన్ని చేస్తారు. పిల్లలతో ప్రేమగా ఉండండి వాళ్ళకి మీ ప్రేమ చాలా అవసరం.ఈ రోజు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తారు.

3. మిథున రాశి

డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఇంట్లో మీ వల్ల బాధలు పడతారు. ముందు మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. మీ ఆర్ధిక చిక్కులు మొదలవ్వనున్నామీ జీవిత భాగస్వామి మీకు ఒక విషయం గురించి చెప్తారు.

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి.మీ ఆఫీస్ పని వల్ల రోజుటి మీద అధికంగా ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానీ మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టాలిసి ఉంటుంది. మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. మీ జీవిత భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.వల్ల మీకు కొత్త ఇబ్బందులు వస్తాయి.

5. సింహ రాశి

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి.
మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది కానీ కొన్ని అనుకోని మలుపులు వస్తాయి. మీరు డబ్బును బాగా పొదుపు చేయాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటికి తీసుకెళ్ళి ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు.

6. కన్యా రాశి

మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి ఎవరు మీకు సహాయం చేయరు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీ వల్ల ఒకరికి మంచి చేయక పోయిన పర్లేదు చెడు చేయకండి. పని ఒత్తిడిని తగ్గించడానికి రోజు మీరు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ వైవాహిక జీవితం మీకు నచ్చిన విధంగా ఉంటుంది.

7. తులా రాశి

మీ పాత స్నేహితులను కలుసుకొని మీ డబ్బును వృధా చేస్తారు. మీరు పని చేసే మీకు పని బాగా ఎక్కువ అవుతుంది. ఐనా మీరు తట్టుకోగలరు.అనుకోని అతిధులు మీ ఇంటికి వస్తారు. అలా రావడం వల్ల మీ పనులు ఆగిపోతాయి.రోజు మీరు మీ జీవిత భాగస్వామిని సరిగా అర్థం చేసుకోక ఆమెను బాధ పెడ్తారు.

8. వృశ్చిక రాశి

ఒక్క క్షణం మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు మీ జీవితంలో గెలిచినట్లే. మీ ముందు మీకు నచ్చని పనులు జరుగుతాయి ఐనా మీరు ఏమి చేయలేరు. మీ జీవితలో మీరు అనుకోని మార్పులు సంభవిస్తాయి. మీ ఆరోగ్య బాధలు పోతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవిత భాగస్వామి మీ మీద అలుగుతుంది.

9. ధనస్సు రాశి

మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయండి. మీరు చేసే పని ఎవరికి చెప్పాలిసిన అవసరం లేదు. ఇతరుల విషయాలను పట్టించుకోకండి. మీకు ఎలా చేయలనిపిస్తే అలా చేయండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

10. మకర రాశి

ఇంట్లో మీ వల్ల బాధలు పడతారు. ముందుమీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులు చెప్పేది వినండి ఇప్పుడు వినకపోతే తర్వాత చెప్పే వాళ్ళు కూడా ఉండరు. మీ జీవితంలో ఎదురు దెబ్బలను బాగా తగులుతాయి. మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

11. కుంభ రాశి

ఈ రోజు మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు. అఫిసులో మీరు చేసే పనికి మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు ఇవి మంచి రోజులు. మీ వైవాహిక జీవితం మారబోతుంది.

12. మీన రాశి

మీకున్న సమస్యల నుంచి బయటపడతారు . మీ ఆరోగ్యం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డబ్బును బాగా ఖర్చు పెడ్తారు. అది మంచి పద్ధతి కాదు. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా గడుపుతారు.

Exit mobile version