Breaking News

జగన్నాథుని రథయాత్రను ఆపేందుకు ప్రణాళిక పూరీ శంకరాచార్య..!

22 nd Jun 2020, UTC
జగన్నాథుని రథయాత్రను ఆపేందుకు ప్రణాళిక పూరీ శంకరాచార్య..!

పూరీ జగన్నాథుని రథయాత్రను ఈ ఏడాది ఆపేందుకు ప్రణాళిక అమలవుతోందని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆరోపించారు. కోవిడ్-19 మహమ్మారిని చూపించి, రథయాత్రను ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.

పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథయాత్ర ఈ నెల 23న జరగవలసి ఉంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ యాత్రను నిర్వహించడంపై సుప్రీంకోర్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ నేపథ్యంలో పూరీ శంకరాచార్య  స్వామి నిశ్చలానంద సరస్వతి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏటా జరిగే ఈ కార్యక్రమాన్ని నిలిపేసేందుకు అత్యంత సమన్వయంతో కూడిన ప్రణాళిక అమలవుతోందన్నారు.

 ఈ నెల 18న ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సవరించాలని కోరుతూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ఈ నెల 20న సుప్రీంకోర్టు స్వీకరించి ఉండవలసిందన్నారు. సెలవుల్లో సైతం ముఖ్యమైన కేసులను సుప్రీంకోర్టు చేపట్టిన సందర్బాలు ఉన్నాయన్నారు.

ఇదిలావుండగా, గజపతి మహారాజా దిబ్యసింఘ దేబ్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఓ లేఖ రాశారు. ఈ నెల 23న నిర్వహించవలసిన జగన్నాథ రథయాత్రను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించే విధంగా జోక్యం చేసుకోవాలని కోరారు.



భక్తులు హాజరు కాకుండా రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాలని ఈ లేఖలో కోరారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox