Breaking News

జగన్నాధుడి రథయాత్ర కు రూట్ క్లియర్..!

22 nd Jun 2020, UTC
జగన్నాధుడి రథయాత్ర కు రూట్ క్లియర్..!
సుభద్ర బలరామ సమేత జగన్నాథుడు ఒడిశా లోని పూరి లో కొలువైన సంగతి తెలిసిందే. ఆయనకు ఏటా రథయాత్రను నిర్వహిస్తుంటారు. ఈ క్రతువు ను కొన్ని వేల సంవత్సరాలు గా నిర్వహిస్తూ వస్తున్నారు.అయితే.. ఈ ఏడాది జగన్నాధుడి రథయాత్ర కు బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి కారణం గా యాత్రను రద్దు చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే.ఒకవేళ పూరి జగన్నాధుడికి రధ యాత్రను నిర్వహిస్తే.. ఎక్కువ మొత్తంలో భక్త జన సందోహం హాజరవుతుందని... ఓ వైపు మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం లో.. వీరిని అదుపు చేయడం సాధ్యం అవకపోతే.. మరింత మందికి కరోనా సోకె అవకాశం ఉంటుందని సుప్రీమ్ కోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
 
          అయితే.. జగన్నాధ రధ యాత్రను రద్దు చేసే విషయమై పలు చోట్ల విమర్శలు తలెత్తాయి.. పలువురు హిందూ పెద్దలు యాత్రను రద్దు చేయడానికి అంగీకరించలేదు. అయితే.. కేంద్రం కూడా అంగీకరించలేదు. కాగా.. ఈ తీర్పును సవరించాలని కోరుతూ... సుప్రీంకోర్టు లో కేంద్రం పిటిషన్లు దాఖలు చేసింది. ఇప్పటి వరకు సుప్రీమ్ కోర్ట్ లో ఈ విషయమై నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కాగా.. సుప్రీమ్ కోర్ట్ కూడా ఈ నాలుగు పిటిషన్ల పైనా విచారణ జరిపింది. 
          విచారణ తరువాత.. ప్రజల ఆరోగ్యం విషయం లో మాత్రం రాజీపడలేమని స్పష్టం చేసింది. అయితే... ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా ఈ రధ యాత్రను జరుపుకోవాలని నిర్దేశించింది. ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఈ రథయాత్ర జరుగుతుందని తీర్పు ఇచ్చింది. ఈ రధ యాత్రలో ప్రజలకు పాల్గొనడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. మొత్తానికి.. జగన్నాధుడి రధ యాత్ర కు రూట్ క్లియర్ అయింది. నిబంధనలతో కూడిన అనుమతులను సుప్రీం కోర్ట్ మంజూరు చేసింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox