Breaking News

అయోధ్య రామాలయ నమూనాతో స్టాంప్ విడుదల చేయనున్న మోదీ..!

30 th Jul 2020, UTC

అయోధ్య : యావత్ భారత్ హిందువుల చిరకాల వాంఛ అయోద్యలో రామాలయ నిర్మాణం. అయితే ఆ స్థలం గొడవల్లో ఉండడంతో ఇంతకాలం ఈ మహత్కార్యం తలపెట్టడం సాధ్యపడలేదు. కేంద్రం జోక్యంతో ఎట్టకేలకు ఈ కేసు ముందుకు కదిలింది. హిందువుల మనస్సాక్షికి ఊరటగా ఉన్నత ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన వెంటనే, ప్రధాని మోదీ అక్కడ రామాలయ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలు పెట్టేసారు.

           అయోధ్య రామ మందిరం ట్రస్ట్ పేరిట ఓ కమిటీ ని ఏర్పాటు చేసి మందిరం నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈ రామ మందిరం కోసం భూమి పూజ జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి విస్తృతం గా వ్యాపించడంతో లాక్ డౌన్ విధించిన కారణంగా ఇది వాయిదా పడింది. తాజాగా ఆగష్టు ఐదవ తేదీన భూమి పూజ చేయడానికి ప్రధాని మోదీ అయోధ్యకు రానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

           మరో వైపు అదే రోజు, ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయ నమూనాతో ఉన్న స్టాంపును విడుదల చేయించాలని ట్రస్ట్ భావిస్తోంది. ప్రధాని మోదీ ఎలాగూ ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు వస్తున్నారు.  కాబట్టి అదే రోజు ఆయన చేతుల మీదుగానే ఈ స్టాంపును విడుదల  చేయాలనీ ట్రస్ట్ భావిస్తోంది. ఈ విషయమై ఆ సంస్థ డైరెక్టర్ వై.పీ. సింగ్ మాట్లాడుతూ ''అన్నీ అనుకున్నట్లు సక్రమంగా జరిగితే ఆగస్టు 5న ప్రధాని చేతుల మీదుగా ఈ స్టాంపు విడుదలవుతుంది. ఒకటి అయోధ్య రామాయల నమూనాతో ఉన్న స్టాంపు కాగా మరొకటి రాముడి ప్రాముఖ్యతలను వివరించే ఫొటోలతో ఉండే అవకాశాలున్నాయి'' అని చెప్పారు. 

మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox