Pitru Paksha 2022 : పితృ పక్షం నేటితో ముగుస్తుంది.ఇది సెప్టెంబరు 10న మెుదలై…నేటితో ముగియనున్నది.ఈ పదిహేను రోజుల సమయంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధం,తర్పణం,పిండ ప్రదానం కార్యక్రమాలు చేస్తారు.పితృ పక్షంలో చనిపోయిన వారి ఆత్మలు భూమికి వస్తాయనే నమ్ముతాము. అయితే పితృ పక్షం సమయంలో ఈ పొరపాటులు జరగకుండా చూసుకోండి.
పితృ పక్షం రోజు ఈ పనులను అసలు చేయకండి
1.పితృ పక్షం సమయంలో వెల్లుల్లి,ఉల్లి,వంకాయ,అన్నం,మాంసం,మరియు బయటి ఆహార పదార్ధాలు ముట్టకండి.ఈ రోజున కేవలం శాఖహారం మాత్రం తీసుకోండి.మీరు తీసుకునే ఆహారంలో నల్ల జీలకర్ర, నల్ల ఉప్పు, నల్ల ఆవాలు పప్పు, ఉసిరి, శెనగ వంటివి మరియు పాత ఆహార పదార్థాలను వాడకండి.
2.పితృ పక్షంలో పిండ ప్రధానం చేసే వ్యక్తి తన జుట్టు, గడ్డం మరియు గోర్లు ఏవి కట్ చేయకూడదు.ఈ సమయంలో ఉతకని బట్టలు మరియు పాత బట్టలు ధరించకూడదు. పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు తాకరాదు.లెదర్ పర్సు ఆ రోజు వరకు పక్కన పెట్టండి.
3.పిండ ప్రధానం చేసే సమయంలో మంత్రాలను జపించేటప్పుడు…ఫోన్ వాడకండి.పితృ పక్షం సమయంలో పొగాకు, సిగరెట్లు, మద్యం, గుట్కా వంటివి చేయ్యరాదు.ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ప్రతిఫలాన్ని ఇవ్వదు.
4.పితృ పక్షంలో ఎలాంటి శుభకార్యాలకు వెళ్లకూడద.అలాగే కొత్త వస్తువులు, కొత్త బట్టలు కూడా కొనకూడదు.