Bathukamma: మూడో రోజు ముద్ద పప్పు బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలు అయ్యాయి. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 07:55 AM IST

Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలు అయ్యాయి. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.

మూడో రోజు 2022 సెప్టెంబర్ 26 న ముద్ద పప్పు బతుకమ్మ

మూడో రోజు 2022 సెప్టెంబర్ 26 న ముద్ద పప్పు బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజున ముద్ద పప్పు, పాలు, బెల్లంతో బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. మహిళలు అందరూ కలిసి గుడి దగ్గరకు కానీ చెరువు గట్టు వద్ద కానీ బతుకమ్మను ఆడతారు.