Site icon Prime9

October 2022 Horoscope: అక్టోబర్ నెలలో ఈ మూడు రాశుల వారి జాతకాలు మారబోతున్నాయి

Horoscope

Horoscope

October 2022 Horoscope: శని దేవుడు ప్రయాణించే మార్గం వల్ల ఈ నెలలో కొంత మందికి శుభాలు జరగనున్నాయి. దాని ప్రభావం ఈ మూడు రాశుల వారికి మంచి జరగనుంది. ఆ మూడు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. మేషం, మీనం , తులా రాశి వారికి ఈ నెల ఏది పట్టుకున్నా బంగారమే . ఈ రాశి వారి సమస్యలు తొలిగిపోనున్నాయి.

మేషం రాశి :-

ఈ రాశికి చెందిన వారు అనుకున్న పనులు చేయగలుగుతారు. మీరు చేసే ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ధన లాభం కూడా వస్తుంది.

తులా రాశి :-

శని గ్రహ సంచారం వల్ల తులా రాశి వారికి మంచి జరగనుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నిలిచినపోయిన పనులన్ని పూర్తవుతాయి.ఈ రాశి వారికి ఈ నెలలో శుభాలు కలుగుతాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టిన మంచి లాభాలు వస్తాయి.

మీనం రాశి :-

ఈ రాశి వారికి ఈ నెలలో శని గ్రహ సంచారం వల్ల మీరు ఎన్నడు చూడలేని అద్భుతాలు చూస్తారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరుతో పాటు, మీ జీతం కూడా పెరుగుతుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

Exit mobile version