Site icon Prime9

Lord Shani: శనిదేవుడి దయ మీపై వుండాలంటే ఇలా చేయండి..

Spiritual: శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. శని కోపానికి గురైతే సర్వం కోల్పోతాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు ఉంటుంది. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు చేయడం వలన శనిగ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు.

శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అదే నూనెతో అభిషేకం చేయాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో వంటకాలు తయారుచేసి ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. ఇదే రోజున నువ్వులను, నల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన వాహనమైన కాకికి ఈ రోజున ఆహారాన్ని ఏర్పాటు చేయాలి.

ఏలినాటి శనిదోషాలలో బాధపడుతున్నవారు వరుసగా 13 శనివారాలు శనిదేవునికి పూజలు చేయవలసి ఉంటుంది. శని త్రయోదశి రోజున శనీశ్వరునికి దీపారాధనలు, నైవేద్యాలు పెట్టడం వలన ఏలినాటి శనిగ్రహాదోషాలు తొలగిపోతాయని పురాణంలో చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం రోజున హనుమంతునికి సింధూరాభిషేకం చేయించడం కూడా మంచి ఫలితం ఉంటుంది. శనివారం రోజు రావి చెట్టుకు నీరు పోయాలి. ఆ తర్వాత పాలలో చక్కెర కలిపి చెట్టు మొదలు వద్ద పోయాలి. తర్వాత ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి దయ మీపై ఉంటుంది. ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.

Exit mobile version