Site icon Prime9

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది!

March 1 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులు మీపై దుష్ప్రచారం చేస్తారు. మీ తెలివితేటలతో పనులను సజావుగా పూర్తి చేస్తారు. స్వల్ప ధన లాభం గోచరిస్తుంది.

వృషభం – ముఖ్యమైన విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మిథునం – మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. తరచూ నిర్ణయాలను మార్చడం అనేది మంచిది కాదు. సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు. పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి.

కర్కాటకం – మనోధైర్యంతో చేసే పనులు మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రారంభించిన పనులను తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.

సింహం – మీరు తీసుకునే నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య – మీ పై అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు.

తుల – శారీరక శ్రమ పెరుగుతుంది. పై అధికారుల ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవదర్శనం చేసుకుంటారు.

వృశ్చికం – ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం. మీ బంధువుల ప్రవర్తన కాస్త మనస్థాపాన్ని కలిగిస్తుంది.

ధనున్సు – సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఒక కొత్త ప్రణాళిక ఏర్పరచుకుంటారు.

మకరం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి సన్నిహితులు సహాయ సహకారులు అందిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు. స్వల్ప ధన లాభ సూచన.

కుంభం – పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. దైనందిన జీవితంలో కొంత మార్పులు గోచరిస్తున్నాయి.

మీనం – బంధుత్వ ఆపేక్షల కన్నా, ధనానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న వర్గం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్య క్షేత్రాలు సందర్షిస్తారు.

Exit mobile version
Skip to toolbar