Breaking News

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు లాటరీ పద్దతిలో భక్తుల ఎంపిక..!

07 th Jun 2020, UTC
అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు  లాటరీ పద్దతిలో భక్తుల ఎంపిక..!

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు జ‌మ్ముకాశ్మీర్ ప్ర‌భుత్వంయాత్రా ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసి కొన్ని నిబంధ‌నల్ని అమలు చేయనుంది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జులై 21న‌ మొద‌లుకొని 15 రోజుల్లో  ముగియ‌నుంది.
. ఈసారి కేవలం నాలుగువేల నుంచి ఐదు వేల మంది యాత్రికుల‌కు మాత్ర‌మే అనుతించ‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. వీరిని లాట‌రీ ప‌ద్ధ‌తిలో ఎంపిక చేయ‌నున్నారు.

సాధార‌ణంగా అయితే బాల్తాల్ స‌హా ప‌హ‌ల్గామ్ మార్గాల్లో అమ‌ర్‌నాథ్ యాత్ర కొన‌సాగేది. కానీ కోవిడ్ దృష్ట్యా ప‌హ‌ల్గామ్ దారిని మూసివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  తీర్థ‌యాత్ర స‌జావుగా సాగేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారు బ‌సీర్ అహ్మ‌ద్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాకుండా క‌రోనా ప‌రీక్ష‌లో నెగిటివ్ వ‌చ్చిన వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని తాజా ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు.

సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన మంచు-లింగాన్ని ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ఏటా దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ల‌క్ష‌ల‌సంఖ్య‌లో ప్ర‌తీ ఏటా జులై చివ‌రివారంలో 45 రోజుల‌పాటు తీర్థ‌యాత్ర కొన‌సాగుతుంది. అయితే గ‌త ఏడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నిర్ణ‌యంతో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల దృష్ట్యా  యాత్ర‌ను మ‌ధ్య‌లోనే నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఈసారి కూడా షెడ్యూల్‌లో కేవ‌లం 15 రోజుల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox