Breaking News

ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు లేనట్లే..!

01 st Jul 2020, UTC
ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు లేనట్లే..!
కరోనా మహమ్మారి పడగ విప్పి.. మానవాళిని కబళిస్తోంది.. రోగ నిరోధక శక్తి ఎక్కువ గా ఉన్నవారు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ కొంత మంది లో ఈ మహమ్మారి తీవ్రత తారా స్థాయి కి చేరుకొని.. ప్రాణాలను వదిలేసుకునే పరిస్థితి వస్తోంది. ఇప్పటి వరకు లాక్ డౌన్ లోనే గడిచిపోయింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్యా పెరుగుతూ వస్తున్నా సంగతి తెలిసిందే. జన జీవనం తిరిగి ప్రారంభం అయ్యాక... ఈ కేసులు మరింత ఎక్కువ గా పెరుగుతున్నాయి. 
 
                    కొన్ని ప్రాంతాలు తిరిగి లాక్ డౌన్ లోకి స్వచ్చందం గా వెళ్లిపోతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువ గా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ని  విధించేస్తున్నాయి. దేశమంతా తిరిగి లాక్ డౌన్ విధిస్తే.. దేశం తీవ్రం గా నష్టపోక తప్పదు.. ఆహార కొరత.. ఆర్థిక కొరత ఏర్పడి.. ఆకలి చావులు చావాల్సి వస్తుంది. ఈ నేపధ్యం లో చేసేది లేక. ప్రభుత్వం కూడా ఆంక్షలను సడలించేసి.. తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించింది.
 
                   ఈ నేపధ్యం లో ప్రజలు గుంపులు గుంపులు గా గుమి గుడే కార్యక్రమాలకు మాత్రం అనుమతుల్లేవని చెప్పింది. పెళ్లి.. వంటి కార్యక్రమాలకు కూడా పరిమిత సంఖ్య లో అనుమతులు ఇస్తోంది. ఈ నేపధ్యం లో.. ఈ ఏడాది గణేష్ నవ రాత్రులు కూడా జరిపించడం కష్టమే అనే పరిస్థితి నెలకొంది. మరో వైపు మహారాష్ట్ర లోను కరోనా కరాళ నృత్యం చేస్తోంది.. ఆ రాష్ట్ర రాజధాని ముంబై లోను పరిస్థితి తీవ్రం గా ఉంది.. ఈ తరుణం లో లాల్‌ బాగుచా రాజా గణేశ్‌ ఉత్సవ్‌ మండల్‌ కమిటీ  గణేష్ ఉత్సవాలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. లాల్‌ బాగుచా రాజా గణేశ్‌ ఉత్సవ్‌ మండల్‌ కమిటీ  ప్రతి ఏడాది పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది మటుకు వీటిని నిర్వహించడం లేదు.. అంతే కాదు.. భారత్ లో పలుచోట్ల నిర్వహించాలా వద్దా అన్న దానిపై కూడా.. పలు సందేహాలు నెలకొన్నాయి.. వీటికి అనుమతులు దొరుకుతాయో లేదో కూడా ప్రస్తుతానికి ఎవరు చెప్పలేకపోతున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox