Breaking News

ఇంద్రకీలాద్రి సర్వం సిద్ధం..!

15 th Oct 2020, UTC
ఇంద్రకీలాద్రి సర్వం సిద్ధం..!

విజయవాడ :మరో రెండు రోజుల్లో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న నేపధ్యంలో అధికారులు ఇంద్రకీలాద్రిని సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

రోజుకు పది వేల మంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. అయితే మూలా నక్షత్రం రోజున మాత్రం 13 వేల మంది భక్తులకు అనుమతి కల్పిస్తామని తెలిపారు.. దసరా ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజునాడు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అమ్మవారి దర్సనం కోసం వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలన్నారు.

మొదటి రోజు మినహాయించి మిగిలిన అన్ని రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. మూలానక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. అలాగే దర్శనానికి వెళ్లే క్యూలైన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తామని తెలిపారు. అయితే కరోనా మహమ్మారి నేపధ్యంలో అన్ని స్నానాల ఘాట్లను మూసివేస్తున్నామన్నారు. తలనీలాలు సమర్పించడానికి కూడా అనుమతులు లేవని స్పష్టం చేసారు. అలాగే దసరా చివరి రోజున తెప్పోత్సవాలకు కూడా భక్తులకు అనుమతులు లేవన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox