Site icon Prime9

Horoscope: నేటి రాశిఫలాలు (27 సెప్టెంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope: నేటి రాశిఫలాలు (27 సెప్టెంబర్ 2022)

ఈరోజు అన్ని రాశుల వారికి శుభ సూచకంగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో మరియు కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

మేషం: ఈరోజు మీకు ఆర్ధికంగా కలిసివస్తుంది. ఆర్దికలావాదేవీలు డీల్స్ ఏమైనా కమిట్ అయ్యేముందు వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు తుది దశకు వస్తాయి. ఆరోగ్యపరంగానూ ఈ రోజు మీకు అనుకూలిస్తుంది.

వృషభం: ఈ రోజు మీకు శ్రమతో కూడిన రోజే తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు రోజులంతా ఆర్ధికసమస్యలు ఎదురుకున్నప్పటికీ, చివర్లో లాభాలను చూస్తారు. మీరు చేసిన పనులకు, మరెవరో గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. ఖాళీ సమయంలో కుటుంబంతో గడపడం జీవితం సంతోషమయంగా ఉంటుంది.

మిథునం: వయసు మీరినవారు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారవేత్తలకు అనుకోని లాభాలు కలుగుతాయి.

కర్కాటకం: ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. మీ సమస్యలు తీవ్రమవుతాయి. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు అనుకూలమైన రోజుగా ఉంటుంది.

సింహం: ఈ రోజు మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకోనివ్వకండి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు కొత్త అనుభూతులను కలిగిస్తుంది. విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నవారికి అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్నిచూపిస్తారు. కుటుంబం నుంచి అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబం నుంచి సపోర్ట్ కరువవుతుంది.

కన్య: మీరనుకున్న విషయాలు జరుగుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను చేకూరుతాయి. ఆరోగ్య పరంగా కాస్త జాగ్రత్తలు వహించాలి. మీ పనికి తగిన ప్రశంసలు కలుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో ప్రేమను పొందుతారు.

తుల: వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజుగా ఈ రోజు మీకు ఉంటుంది. ఇంటిలో పరిస్థితులు కాస్త అస్తవ్యస్తంగా ఉంటాయి. నూతన పనులు మొదలు పెట్టి అనుకున్నవి అనుకున్నట్టుగానే చేస్తారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. అనుకోని అతిథి కారణంగా మీ ప్లాన్స్ అన్నీ పాడవుతాయి.

వృశ్చికం: ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంటుంది. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల నుంచి సపోర్ట్, ప్రశంసలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ యొక్క పనులకు విరామము ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సమయాన్ని గడుపుతారు.

ధనస్సు: అతిచిన్న విషయాల గురించి కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అవి మితిమీరకుండా చూసుకోండి లేదంటే సంబంధాలు దెబ్బతింటాయి. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు వస్తాయి.ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా మంచి ప్రతిభ కనపరుస్తారు. తద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మకర: రియల్ ఎస్టేట్ రంగంలో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ఎవరితో కలిసి ఉంటున్నారో, వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీకు దగ్గరి వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు.

కుంభం: ఆర్థికపరమైన విషయాల్లో మీరురాణిస్తారు. మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీయొక్క ప్రశాంత వైఖరివలన అన్నిటిని సరిచేస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.

మీన: ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీరు ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉండేలాగ చేస్తుంది. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ ఈ రోజు చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటుంది.

ఇదీ చదవండి: బతుకమ్మకు ఏఏ రోజు ఏఏ నైవేధ్యం పెడతారో తెలుసా..!

Exit mobile version