Site icon Prime9

Horoscope: నేటి రాశి ఫలాలు (30 నవంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.

1.మేష రాశి
ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. మీరు చేసిన పాత పెట్టుబడులు ఈ రోజు లాభదాయకమైన రాబడిని తెచ్చి పెడతాయి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లండి. ఆరోగ్యం వ్యాయామం పట్ల ఏకాగ్రత వహించండి. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ సమీప బంధువులు లేదా మీ జీవిత భాగస్వామి వైపు వారి నుంచి ఓ మంచి వార్త వింటారు.

2.వృషభ రాశి
మీరు శారీకకంగా చేసుకునే మార్పులు, ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. ఈరోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం, మీ కుటుంబసమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి, సహాయపడగలవు. ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్నిఆర్థిక నష్టాలను ఎదురుకుంటారు. ఇది మీ యొక్క రోజు మొతాన్ని దెబ్బతీస్తుంది.

3. మిథున రాశి
మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నపటికీ , కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి
ఒక స్నేహితునికి మీ ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. దీర్ఘ కాలిక పెట్టుబడులను పెట్టకండి అవి మీకు ఆర్థికంగా నష్టాలను కలిగిస్తాయి. మీ బిజీ లైఫ్ నుంచి కాస్త బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. అనుకోని లాభాలను చూస్తారు.

5. సింహ రాశి
ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు వస్తాయి. భవిష్యత్తులో మీరు ఆర్ధికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈరోజు నుండి డబ్బును పొదుపు చేయండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

6. కన్యా రాశి
నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలో ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థికనష్టాలను ఎదురుకుంటారు. ఇది మీ యొక్క రోజుమొతాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళనను కలిగిస్తాయి. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేలా ఆనంద క్షణాలను గడపండి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు.

7. తులా రాశి
గాలిలోమేడలు కట్టడం ఎలాంటి ప్రయోజనం ఉండదు, మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒక పని చెయ్యాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్స్ లో మదుపు చెయ్యండి. ఆర్థిక పరంగా ఈ రోజు మీరు దృఢంగా ఉంటారు. ఆరోగ్యపరం బాగుంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు ఉల్లాసంగా సంతోషంగా కుటుంబంతో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి
మీ ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలను చూస్తారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ బెటర్ హాఫ్ తో ఆనందంగా ఉంటారు.

9. ధనస్సు రాశి
ఇతరుల అవసరాలు, మీ కోరికతో ముడిపడి ఉండడం వలన అందరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను నలుగురితో సంతోషంగా పంచుకోండి. అలాగే, రిలాక్స్ అవడానికి సమయాన్ని కేటాయించండి. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి. లేనిచో మీయొక్క ఉద్యోగంపోయే ప్రమాదం ఉన్నది. తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేయగలదు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

10. మకర రాశి
ఎవరేనా మిమ్మల్ని అప్ సెట్ చెయ్యాలని చూస్తారు. కానీ, ఆ కోపాలేవీ మీ దరిచేరకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు, మీ శరీరం పైన డిప్రెషన్, ఒత్తిడులు మీకు అనవసర ఇబ్బందులను కలిగిస్తాయి. మీ హాస్యచతురత మీకు మంచి ఆభరణం. ఆరోగ్యం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు సన్నిహితులు లేదా స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు.

11. కుంభ రాశి
ఈరోజు మీరు రిలాక్స్ అవడానికి సమయం దొరుకుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఊరట కలుగుతుంది. మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో సరదాగా గడుపుతారు. మీకు బాగా నచ్చే పనులను చేస్తారు. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

12. మీన రాశి
చిన్నవిషయాలు మనసును చీకాకు పరచనివ్వకండి. ఈరోజు మీరు స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం మానాలి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని కలిగించడం వల్ల ఈ రోజంతా మీకు ఆహ్లాదకరమే. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రశంసలు పొందుతారు.

Exit mobile version