Site icon Prime9

Horoscope: నేటి రాశి ఫలాలు (09 అక్టోబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope: ఈరోజు అన్ని రాశులవారికి ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ బాగుంటుంది. అందరూ తమతమ జీవిత భాగస్వాములతో ఆనందంగా గడుపుతారు. కాకపోతే కాస్త ఆర్థిక ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. లేందటే మీరు నష్టపోయే పరిస్థితి, ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితిని ఎదుర్కొంటారు.

1.మేష రాశి
మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచే పనులలో నిమగ్నమవ్వండి. చాలా కాలంగా వసూలవని మొండి బాకీలు నేడు వసూలు అవ్వడం వల్ల ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మీ మిత్రులతో గడిపే సాయంత్రాలు, లేదా షాపింగ్ చెయ్యడం వంటివి చేస్తారు. ఉద్యోగస్థులకు నేడు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా జరుగుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

2 .వృషభ రాశి
సృజనాత్మకతతో కూడిన పనులు లేదా అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. మీకు తెలియనివారి నుండి ఈ రోజు ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన మీ యొక్క ఆర్ధిక సమస్యలు నేడు తొలగిపోతాయి. అనవసరమైన తగువులకి చోటివ్వకండి, దానికి బదులు వాటిని సామరస్యంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతతను నాశనం చేసే వ్యక్తులకు పనులకు కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈరోజు మీ వైహహిక జీవితం మంచిగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

3. మిథున రాశి
నిరాశ నిసృహలను మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు ఈ రోజు చివర్లో తగినంత ధనం లభిస్తుంది వాటిని మీరు పొదుపు చేయగలరు. మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీకు మీ భాగస్వామికి మధ్య తగువలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

4. కర్కాటక రాశి
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఖర్చులు పెరుగుతాయి. మీరు తలపెట్టిన ఇంటిపని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం దానధర్మాలు చెయ్యండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి తద్వారా సంతోషంగా ఉంటారు. జీవితంలో ఆనంద సమయం గడపడం కోసం కాస్త మీ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం గడపండి.

5. సింహ రాశి
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, కష్టాలు అన్నింటి నుంచి ఈ రోజు మీకు రిలీఫ్ వస్తుంది. హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపేవిధంగా జీవిత విధానాన్ని మార్పు చేసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిరోజుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. వృత్తిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీరు పనిచేసే దగ్గర మంచి ఫలితాలు వస్తాయి.

6. కన్యా రాశి
రియల్ ఎస్టేట్ లో తగినంత సొమ్మును మదుపు చెయ్యడం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తనవలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి.
మీ ఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి తోడ్పడతాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు మీ సంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. ఇది మీయొక్క ఆనందానికి కారణం అవుతుంది. ఈరోజు మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ప్రాధాన్యతగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి, లేదంటే మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. ఈ రాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా శ్రమించి పనిచేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఇంటి విషయాలు కొన్నింటిని, అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. మీ సందేహ స్వభావం, ఓటమి పాలవ్వడానికి కారణం అవుతుంది. మీకు తెలియనివారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన మీ యొక్క ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి విషయాలకు ఈ రోజు అనుకూలమైన రోజు.
పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

10. మకర రాశి
మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేస్తారు. దానితో మీకు సంతోషం కలుగుతుంది. ధన లాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీరు మీ జీవితభాగస్వామి పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేకానీ చిన్న సమస్యలకే వీధిన పడకండి. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

11. కుంభ రాశి
ఈ రోజుంతా మీ మూడ్ చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ భావోద్వేగాలని అదుపు చేసుకోండి. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని మాత్రమే సంప్రదించండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ ప్రేయసితో ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. చిరకాలంగా వసూలుకాని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వయసు మీరిన బంధువులకు అకారణ డిమాండ్ లు చెయ్యకండి. ప్రతి చిన్న విషయానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడకండి. మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇదీ చదవండి: నాలుగు పిల్లర్లపై దేవాలయ నిర్మాణం….చూడాలంటే విమానం ఎక్కాల్సిందే…

Exit mobile version