Site icon Prime9

Horoscope: నేటి రాశిఫలాలు (02 డిసెంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.

1.మేష రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లాభాలు మిమ్మల్ని వరిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చాలా సరదాగా సమయాన్ని గడుపుతారు.

2.వృషభ రాశి
మీరు తీవ్ర భావోద్వేగాలతో ఉంటారు. కనుక మీరు హర్ట్ అయే చోట్లకి వెళ్ళకుండా దూరంగా ఉండండి. మీరు మీ జీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మీకు ఆర్ధికలాభాలు చేకూరుతాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

3. మిథున రాశి
మీరు రోజులంతా ఆర్ధిక సమస్యలు ఎదురుకున్నప్పటికీ, చివర్లో మీరు లాభాలను చూస్తారు. ఇంటిపని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి
ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తి చేసేస్తారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే, మీరు ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటారు. మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

5. సింహ రాశి
మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలెయ్యాలి. ఎందుకంటే, మీ ఆరోగ్యం సత్వరమే, పాడయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

6. కన్యా రాశి
మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ భాగస్వాములు మీకు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. వైవాహిక జీవితం బాగుంటుంది.

7. తులా రాశి
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. మీరు ఇంతమునుపు ఎక్కువ ఖర్చు పెట్టివుంటే, మీరు ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తారు. దీని వలన మీకు డబ్బు అవసరమైనా చేతికి అందదు. ఆరోగ్యపరం బాగుంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

8. వృశ్చిక రాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన వారు సంతోషం, ఆనందాన్ని పొందుతారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇది మీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలను చూస్తారు. మీ బెటర్ హాఫ్ తో ఆనందంగా ఉంటారు.

9. ధనస్సు రాశి
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. ఉద్యోగ రీత్యా మంచి ప్రశంసలను పొందుతారు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

10. మకర రాశి
ఆందోళన లేకుండా ఉండడమే సంతోషానికి నాంది. ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తము మీ చేతికి అందదు.
ఆరోగ్యం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు సన్నిహితులు లేదా స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

11. కుంభ రాశి
ప్రయాణం మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు, చాలా చక్కటి వినోదకారకంగానూ మరియు సంతోషకరంగానూ ఉంటాయి. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఊరట కలుగుతుంది.

12. మీన రాశి
వివాహము అయిన వారు వారియొక్క సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన, మీరు అప్ సెట్ అవుతారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రశంసలు పొందుతారు.

Exit mobile version