Prime9

Shani Jayanti 2025: శని జయంతి రోజు.. ఈ ఒక్క పరిహారం చేస్తే పాపాలన్నీతొలగిపోతాయ్

Shani Jayanti 2025: ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య రోజున ‘శని జయంతి’ జరుపుకుంటారు. ఈ రోజున.. శనిదేవుడిని సరైన పద్ధతిలో పూజించే సంప్రదాయం ఉంది. శని జ్యేష్ఠ అమావాస్య రోజున జన్మించాడని చెబుతారు. అందుకే ఈ రోజును శని జయంతిగా జరుపుకుంటారు. శనిదేవుడు సూర్యుని కుమారుడు. అంతే కాకుండా కర్మ ఫలాలను ఇచ్చేవాడు. శని ప్రత్యేక ఆశీస్సులు పొందడానికి , జీవితంలోని అన్ని కష్టాల నుండి బయటపడటానికి శని జయంతి నాడు ప్రత్యేక పూజలు చేయాలి. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి. దీని ద్వారా శనిదేవుడు త్వరగా సంతోషిస్తాడు.

శని జయంతి 2025 తేదీ:

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం ఈ తేదీ 27 మే 2025.. మంగళవారం నాడు శని జయంతి వస్తుంది. ఈ తేదీ 26 మే 2025న మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై మే 27న ఉదయం 08:32 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం.. మే 27న జయంతి జరుపుకోవాలి.

శని జయంతి 2025 పూజా విధి:
శని జయంతి రోజున.. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత.. ఇంట్లోని పూజగదిలో దీపం వెలిగించండి. తర్వాత ఇంటి బయట ఉన్న ఏదైనా శనిదేవుడి ఆలయానికి వెళ్లి శనిదేవుడికి నూనె , పువ్వులు సమర్పించండి. దీని తరువాత శని చాలీసా పారాయణం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. ఉపవాసం విరమించే ముందు పేదవారికి దానం చేయండి. మత విశ్వాసాల ప్రకారం నిర్దేశించిన నియమాల ప్రకారం పూజలు , ఉపవాసం పూర్తయిన తర్వాత శనిదేవుడు భక్తుడి కష్టాల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాడు.

శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మార్గాలు:

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. శని జయంతి రోజున పూజా సమయంలో శని చాలీసా పఠించాలి. దీంతో పాటు.. శని జయంతి రోజున రావి చెట్టుకు నీరు అర్పించండి. ఇదే కాకుండా.. సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఇది జీవితంలో ఆనందం , శ్రేయస్సును తెస్తుంది.

Exit mobile version
Skip to toolbar