Site icon Prime9

Rahu Transit 2025: 18 ఏళ్ల తర్వాత రాహువు సంచారం.. వీళ్లు కోటీశ్వరులయ్యే ఛాన్స్

Rahu Transit 2025

Rahu Transit 2025

Rahu Transit In Aquarius 2025: శని, రాహువు వంటి ప్రధాన గ్రహాలు ఒకే రాశిలో కలిసి సంచరిస్తే.. అది మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రాహువు మార్చి 29 నుండి మే 18, 2025 వరకు శని రాశిలో సంచరిస్తాడు. శని దేవుడు మనల్ని కష్టపడి పనిచేయడానికి, క్రమశిక్షణతో ఉండటానికి, సరైన మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాడు. ఇదిలా ఉంటే రాహువు ప్రభావం మనల్ని ఆకస్మిక మార్పులు, ఊహించని మార్గాల వైపు ఆకర్షిస్తుంది.

ఈ సమయంలో.. కొన్ని రాశుల వారికి ఆర్థిక , వ్యాపార పరంగా లాభాలు పెరుగుతాయి. కానీ రాహువు ప్రభావం వల్ల గందరగోళం , చిక్కులు కూడా తలెత్తుతాయి. అందుకే మనం సమతుల్యతను కాపాడుకోవడం, మన నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సంచారం మీ రాశిపై ఎలా ప్రభావం చూపుతుందో, ఈ సమయంలో ఏ రాశుల వారు ఎక్కువగా ప్రభావితం అవుతారో తెలుసుకుందామా..

వృషభ రాశి: మీ రాశి యొక్క 11వ ఇంట్లో శని, రాహు సంచారం జరుగుతోంది. ఈ సంచారం మీకు అనేక లాభాలను తెచ్చి పెడుతుంది. ఆర్థిక పరంగా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ కృషి , అంకితభావానికి ప్రతిఫలం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మీ సర్కిల్ పెరుగుతుంది. కొత్త స్నేహితులు, పరిచయాల వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది.

కర్కాటక రాశి: శని, రాహువులు మీ 9వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఇది అదృష్టం, ఉన్నత విద్య, సుదీర్ఘ ప్రయాణాలకు కారణం అవుతుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అంతే కాకండా మీ జీవితంలో కొత్త అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య లేదా ఆధ్యాత్మిక పురోగతికి కొత్త అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకువస్తుంది. వివాహ జీవితం కూడా సంతోషంగా ముందుకు సాగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టే వారికి ఇది చాలా మంచి సమయం.

తులా రాశి: ఈ సంచారం మీ ఆరవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మీరు మీ బాధ్యతలను మెరుగ్గా నిర్వహించగలుగుతారు. అయితే.. రాహువు ప్రభావం ఆరోగ్యంలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది కాబట్టి, ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం అవసరం. మీరు పనిలో సవాళ్లను ఎదుర్కోవచ్చు.. కానీ వాటిని సక్రమంగా నిర్వహించగలుగుతారు.

మకర రాశి: మీ రాశి యొక్క మూడవ ఇంట్లో శని, రాహువులు సంచరిస్తున్నారు. ఇది ధైర్యం, కమ్యూనికేషన్ , చిన్న ప్రయత్నాలకు కారణం అవుతుంది. ఈ సమయంలో.. మీరు కొత్త ఆలోచనల కారణంగా సాహసోపేతమైన అడుగులు వేస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు , నెట్‌వర్కింగ్‌ను మెరుగుపరచుకోవడానికి ఇదే మంచి సమయం. మీ చిన్న ప్రయత్నాలలోనే మీరు పెద్ద ప్రయోజనాలను చూస్తారు. ఒత్తిడి పూర్తిగా దూరం అవుతుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యలతో మంచి సమయాన్ని గడుపుతారు. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండటానికి అవకాశాలు కూడా లభిస్తాయి.

కుంభ రాశి: ఈ సంచార ప్రభావం మీ వ్యక్తిత్వం, జీవితంపై ఉంటుంది. దీని అర్థం ఈ సమయంలో మీ జీవితంలో అంతర్గత మార్పులు, వ్యక్తిత్వ మార్పులు ఎక్కవుగా వస్తాయి. ఇది ఆత్మపరిశీలన , స్వీయ-అభివృద్ధికి సమయం. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందుతారు. అంతే కాకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబం యొక్క మద్దతు కూడా మీకు ఉంటుంది. విద్యార్థులు కూడా శుభ వార్తలు వింటారు. అంతే కాకుండా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం.

Exit mobile version
Skip to toolbar