Site icon Prime9

Rahu Ketu Gochar 2025: రాహువు- కేతువుల సంచారం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు

Rahu Ketu Gochar 2025

Rahu Ketu Gochar 2025

Rahu Ketu Gochar 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు, కేతువు మే 18న సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. మే 18న సాయంత్రం 4 గంటలకు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం శని కూడా ఇదే రాశిలోకి మారిన తర్వాత రాహువు క్రూరత్వం పెరుగుతుంది. ఫలితంగా 12 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశితో పాటు 3 రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి. ఆ రాశులేవో తెలుసుకుందామా..

వృషభ రాశి: రాహువు, కేతువుల సంచారం మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా ఈ సంచారం యొక్క అశుభ ప్రభావం మీ కుటుంబ జీవితంలో ఇబ్బందులను కలిగిస్తుంది. అంతే కాకుండా మీ తల్లి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు అకస్మాత్తుగా పెరుగుతాయి. డబ్బు కోల్పోవడం వల్ల మీ మనస్సు కూడా కలత చెందుతుంది. అంతే కాకుండా మనస్సులో నిరాశ చాలా వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

కర్కాటక రాశి: రాహువు, కేతువుల సంచారం మీ కుటుంబ జీవితంతో సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా మీరు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా ఉంది. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు వస్తాయి. పెట్టుబడుల్లో నష్టపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అంతే కాకుండా మీరు మునుపటి కంటే మెరుగ్గా పనిచేసినా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రయాణాలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

సింహ రాశి: రాహువు, కేతువు సంచారం సింహ రాశి వారికి అంత మంచిది కాదు. మీరు ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల సమస్యలు ఎదుర్కుంటారు. అంతే కాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలు చాలానే వస్తాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కూడా ఉద్రిక్తత పెరుగుతుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితం అవుతుంది.

కన్య రాశి: కన్యా రాశి వారికి రాహువు కేతువుల సంచారం అనుకూలంగా ఉండదు. ప్రయాణ సమయంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అంతే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో ప్రభావితం అవుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో డబ్బులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

Exit mobile version
Skip to toolbar