Site icon Prime9

Mercury Transit in May: బుధుడి సంచారం.. కుంభ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?

Mercury In Aquarius

Mercury In Aquarius

Mercury Transit on May 24th affect on Aquarius: బుధుడు కొన్ని రోజులు వృషభ రాశిలో ప్రయాణం చేస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహం చాలా శుభప్రదమైనది. అంతే కాకుండా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటాడో.. వారి జీవితంలో అన్ని రకాల విజయాలను పొందుతారు. మే 23, 2025న జ్ఞాన గ్రహం అయిన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి సంచారం వల్ల 12 రాశిచక్రాలపైనా ఒక ప్రత్యేక రకమైన ప్రభావం కనిపిస్తుంది. కుంభ రాశి వారిపై బుధ సంచారం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

 

కుంభ రాశిపై ప్రభావం:

కుంభ రాశి వారికి, ఐదవ , ఎనిమిదవ ఇంటి పాలక గ్రహం బుధుడు. వేద జ్యోతిషశాస్త్రంలో జాతకంలోని నాల్గవ ఇల్లు తల్లి, ఆనందం, వాహనం, భూమి, ఇల్లు, సౌకర్యాలను సూచిస్తుంది. కుంభ రాశి వారికి, వృషభ రాశిలో బుధ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేయలేని పని చాలా సులభంగా పూర్తవుతుంది. కుంభ రాశి వారికి నాల్గవ ఇంట్లో బుధుడు ఉండటం ఒక అద్భుతం లాంటిది. ఈ సమయంలో కొత్త పని ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. పదోన్నతి, జీతం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి బుధ సంచారం చాలా మేలు కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

 

జాతకంపై బుధుని ప్రభావం:

జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. జాతకంలో బుధుడి స్థానం ఆ వ్యక్తి జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. జన్మ జాతకంలో బుధుడు లగ్నం యొక్క ఇంట్లో ఉంటే.. ఆ వ్యక్తి కమ్యూనికేషన్‌లో నైపుణ్యం కలిగి ఉంటాడు. ఇది మాత్రమే కాదు బుధ గ్రహ ప్రభావం వల్ల ఒక వ్యక్తి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా అతను శారీరకంగా అందంగా మారుతాడు. ఒక వ్యక్తి జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే అతడిని తరచుగా వ్యాధులు చుట్టుముడతాయి. దీంతో పాటు, ఆ వ్యక్తి జీర్ణశక్తి బలహీనంగా ఉండటం, కడుపు నొప్పి, జుట్టు సమస్యలతో కూడా బాధపడుతుంటాడు. అదే సమయంలో.. జాతకంలో బుధుని స్థానం సరిగ్గా లేకపోతే కమ్యూనికేషన్‌లో సమస్యలు ఉంటాయి. ఇది సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో పాటు వ్యాపారంలో వైఫల్యం, ఉద్యోగంలో ఒత్తిడి , విద్యా రంగంలో పదేపదే వైఫల్యాలను ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది.

 

Exit mobile version
Skip to toolbar