Site icon Prime9

Horoscope: నేటి రాశిఫలాలు( 28 సెప్టెంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

అన్ని రాశుల వారికి ఈ రోజుగా అనుకూలంగా ఉంది.  ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది. ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు. అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈ రాశికి చెందిన వారు అనుకున్న వాటిని సాధిస్తారు.

1. మేషం: యోగా ధ్యానంతో మీ రోజును ప్రారంభించడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పనికి తగిన ప్రశంసలను పొందుతారు. ఈ రోజు మీ కళాదృష్టి, సృజనాత్మకతతో ఎదుటివారి మెప్పును పొందుతారు. కుటుంబంతో కాస్త సమయం గడపడం ద్వారా ఈ రోజు ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల పట్ల కాస్త జాగ్రత్త వహించండి.

2. వృషభం: ఈ రోజు మీరు చిరునవ్వుతో మీకున్న అన్ని సమస్యలకు ఎదుర్కొంటారు. ఆర్ధిక లావాదేవీలు కలిసివస్తాయి. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా గడుపుతారు. కోపాలేవీ మీ దరిచేరకుండా చూసుకోండి. డిప్రెషన్, ఒత్తిడులు వంటివి చర్మ సంబంధ సమస్యలకు దారితీస్తాయి. లీగల్ విషయాలలో లాయర్ సలహా తీసుకోండి.

3. మిథునం: అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకు మీరు మీ శారీరాన్ని వ్యాయామంతో బిజీగా ఉంచండి. తద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. మీకు ఈరోజు మంచి ఫలితాలనిస్తుంది. స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారవేత్తలకు అనుకోని లాభాలు కలుగుతాయి.

4. కర్కాటకం: ఈ రాశి వారికి ఈ రోజు పనిచేసే చోట, సీనియర్లనుండి ఒత్తిడి ఎదురవుతుంది. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.పెట్టుబడుల వ్యవహారలలో సొంత నిర్ణయాలనే తీసుకొండి. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు అనుకూలమైన రోజుగా ఉంటుంది.

5. సింహం: ఈ రోజు మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. మీకున్న కుతూహల స్వభావంతో మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలచుకుంటారు. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు. ఈ రోజు మీరు కోపాన్ని అధిగమిస్తే అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్నిచూపిస్తారు. కుటుంబం నుంచి అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబం నుంచి సపోర్ట్ కరువవుతుంది.

6.కన్య: ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. ఈరోజు మీ తోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుంటారు. మీరు వారికోరికను నెరవేరుస్తారు. కానీ అది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను చేకూరుతాయి. మీ పనికి తగిన ప్రశంసలు కలుగుతాయి.

7.తుల: ఈరోజు ఈ రాశిలో ఉన్ననిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వారియొక్క ఆర్థిక స్థితి కుదుటపడుతుంది. కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం మీమనసుకు నెమ్మది చేకూరుతుంది.

8. వృశ్చికం: ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యము బాగుంటుంది. అందువలన మీరు సన్నిహితులతో ఆనందదాయక జీవితం కొనసాగిస్తారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంనీయంగానూ ఉంటుంది. చాలా కాలం తర్వాత మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోష సమయాన్ని గడుపుతారు.

9. ధనస్సు: మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. అనవసరమైన ఖర్చులు మితిమీరకుండా చూసుకోండి దాని వల్ల ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా మంచి ప్రతిభ కనపరుస్తారు. తద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

10. మకర: మీ ఎప్పటిని నుంచో అనుకున్న మీ కల నెరవేరుతుంది. కానీ మీ ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే, మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది.
ఉద్యోగస్థులకు ఈ రోజు అనుకూలిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు.

11. కుంభం: ఆర్థికపరమైన విషయాల్లో మీరు రానిస్తారు. కానీ మీ అనవసర ఖర్చులు మీ తల్లిందడ్రులకు కోపాన్ని తెప్పిస్తాయి. మీరు ఈ రోజు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామితో గొడవలకు ఈ రోజు మీ బంధువులు కారణం అవుతారు. కాస్త జాగ్రత్త వహించండి.

12. మీన: ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. బాగా పరపతి ఉన్న వ్యక్తలతో సావాసం మీకు మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. డబ్బు అధిక ఖర్చులను తగ్గించుకోవడం వల్ల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ పనిలో మీకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.

ఇదీ చదవండి: బతుకమ్మకు ఏఏ రోజు ఏఏ నైవేధ్యం పెడతారో తెలుసా..!

Exit mobile version