Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు ( ఆదివారం ఆగష్టు 28, 2022 )

daily horoscope details

daily horoscope details

రాశి ఫలాలు ( ఆదివారం ఆగష్టు 28, 2022 )

1. మేష రాశి

ఈ రోజు మీకు ఉల్లాసాన్ని , ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమకి ఉన్న శక్తి ఏమిటో మీకు ఈ రోజు అర్థం అవుతుంది. మీకు చాలా ఇష్టమైన ఇష్టమయిన సామజ సేవ చేయడానికి , ఈ రోజు మీదగ్గర సమయం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోండి. మీరు ఒక వాస్తవాన్ని ఈ రోజు తెలుసుకుంటారు. మీ ప్రయాణములో ఒకరిని ఈ రోజు కలుసుకుంటారు,దీని వలన మీ ప్రయాణములో కొన్ని మార్పులు వస్తాయి.

2. వృషభ రాశి

పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ రోజు మీరు ఎక్కువ డబ్బును ఖర్చు పెడ్తారు. మీ స్నేహితులు మీకు అండగా ఉంటారు.
ఇంట్లో అసహనానికి గురి అవుతారు. ప్రేమ విషయంలో ఆచి , తూచి అడుగులు వేయండి. మీ భాగస్వామి మిమ్మల్ని ఏడిపించవచ్చు. ఈ రోజు మీ మనస్సు ఆలోచించడం మొదలు పెడుతుంది.

3. మిథున రాశి

ఈ రోజు అతిగా తినకండి. లేని పోనీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇంటి చుట్టుపక్కల కొన్ని మార్పులను చూస్తారు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు . ఈ రోజు మీరు ప్రేమలో పడనున్నారు. మీ వైవాహిక జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఏ నిర్ణయం ఐన తీసుకోండి.

4. కర్కాటక రాశి

కొన్ని కష్టాలను పడాలిసి వస్తుంది . ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు . ఈ రోజు మొత్తం ఆనందంగా ఉంటారు . ఈ రోజు మీ తల్లిదండ్రులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఒక గిఫ్ట్ ఇవ్వబోతోంది. పని ఎక్కువ అవడం వల్ల అలిసిపోతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

5. సింహా రాశి

ఈ రోజు మీరు ఆర్ధికంగా నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కలలను నిజం చేసే అవకాశం మీకు దగ్గరలోనే ఉన్నది. మీ జీవిత భాగస్వామితో గొడవలు పడకుండా సంతోషంగా ఉండండి. మీ కుటుంబంలో చిన్నవారితో మీరు ప్రేమగా మాట్లాడండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో చాలా ముఖ్య మైన రోజు అవుతుంది. ఈ రోజు మీ నాన్నగారితో చాలా ప్రేమగా ఉంటారు. మీ నాన్న గారు కూడా మీతో బాగా మాట్లాడతారు. మీ మాటలు మీ నాన్నగారిని ఆనంద పడేలా
చేస్తాయి.

6. కన్యా రాశి

మీరు ఏ రోజు టెన్షన్ పడుతూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని వత్తిడి కొంచం తగ్గుతుంది. అందరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి . మీ కుటుంభ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ జీవితం మీకు నమ్మలేని విధంగా అనుభవాలనిస్తుంది. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోండి. మీ నాన్న గారు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వనున్నారు.

7. తుల రాశి

మీ వైవాహిక జీవితాన్ని మీ చేతులారా పాడు చేసుకోకండి. మీరు తరువాత బాధ పడిన ప్రయోజనం ఉండదు . పగటి కలలు కనకండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏమైన అన్నా , మీరు మాత్రం ప్రేమగానే ఉండండి. మీ జీవిత భాగస్వామితో గొడవలు పడకండి. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.

8. వృశ్చిక రాశి

పని కన్నా ముందు ఆరోగ్యం ముఖ్యం. ఈ విషయం ముందు ముందు మీకు బాగా తెలుస్తుంది. ఆలోచనలతో మీ మైండు పాడు చేసుకోకండి. మీ జీవిత భాగస్వామికి మీరు సహాయం చేస్తారు. గాలిలో మేడలు కట్టలేరు. గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి.

9. ధనస్సు రాశి

మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. కొత్త ప్రాజెక్టును మొదలు పెడతారు. మీరు ఉండే విధానాన్ని మార్చుకోవాలిసి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో గొప్ప రోజు అవ్వనుంది.

10. మకర రాశి

మీరు బలంగా మారాలి. మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీరు తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. మీ పెట్టుబడులు నష్టాలను చూస్తారు. మీరు ఈ రోజు సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితంలో మార్పులు రానున్నాయి. మీ తోటి ఉద్యోగులకు మీరు సహాయం చేస్తారు.

11. కుంభ రాశి

మీరు డబ్బును బాగా సంపాదించాలి. మీ ఇంటిని మారుస్తారు. ఈ రోజు మీరు ఫుల్ బిజీ అవుతారు.
అలోచించి అడుగులు ముందుకు వేయండి. దీని వల్ల మీ జీవితం భాగస్వామి మీ మీద అలుగుతారు . మీ మాటలు వల్ల వారు నార్మల్ అవుతారు . మీరు మీ జీవిత భాగస్వామికి ప్రామిస్ చేస్తారు .

12. మీన రాశి

అనుకోకుండా ప్రయాణాలకు వెళ్తారు. దీని వల్ల మీ ఆరోగ్యం కొంచెం దెబ్బ తింటుంది. ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్లినా బాగా తిని బయటికి వెళ్ళండి. డబ్బును చూసి ఖర్చు పెట్టండి. కుటుంబ సభ్యులతో కూడా గడపండి. సాయంత్రానికి అలసట తగ్గి నార్మల్ అవుతారు. మొత్తానికి ఈ రోజు బాగానే ఉంటుంది.

Exit mobile version