Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు ( సోమవారం ఆగష్టు 29, 2022 )

daily horoscope details

daily horoscope details

రాశి ఫలాలు ( సోమవారం ఆగష్టు 29, 2022 )

1. మేష రాశి

మీరు మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఏదయినా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్ధిక సహాయము అందుతుంది. మీ కుటుంబంతోను, స్నేహితులతోను మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. మీ వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో మీకు ఈ రోజు అందంగా ఉండబోతుంది. మీ భాగస్వామితో కలిసి సాయంత్రం బయటికి వెళ్ళండి. మీకంటే చిన్నవారియొక్క సలహాలను తీసుకోకండి.

2. వృషభ రాశి ఫలాలు

మీ వ్యక్తిగత సమస్యలు వలన మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది . మీకు బాగా ఇష్టమైన వారి నుండి ఫోన్ రావడంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈ రోజు మీ కొరకు చాలా సమయము దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. వైవాహిక ఆనందానికి , అనుకోకుండా మీకు ఓ అద్భుతం జరగ బోతుంది. మీ కుటుంబం లోని వారు మీ కోసం మంచి వంటకాలను తయారు చేస్తారు.

3. మిథున రాశి

ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు అనుకోని బాధ్యతలు వచ్చి పడతాయి. మీరు మీ కోసమే పని చేయాలి , ఇతరుల కోసం కాదు. ప్రయాణాలు వెంట వెంటనే చేయకండి. ఈ రోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. ఈ రోజు మీరు అతిగా పని చేయుట వలన మీరు బాగా అలిసిపోతారు. ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం చేయండి.

4. కర్కాటక రాశి

ఈ రోజు చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బావుంటుంది. దూరం బంధువుల నుంచి శుభవార్త వింటారు . ఈ రోజు మీరు టీవీ , ఫోనులో కాలక్షేపం చేస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. మీ పిల్లలను దగ్గరకు తీసుకుంటారు . ఈ రోజు మీరు, మీ పిల్లలతో గడపడానికి మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది.

5. సింహ రాశి

ఈ రోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కొత్త స్నేహితులను పొందుతారు . ఈ రోజు మీకు మరొక లాభదాయకమైన రోజుగా మారుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు అద్భుతమైన రోజుగా మీ జీవితంలో మిగిలిపోతుంది. మీకు బాగా దగ్గరవారి వల్ల మీరు నిరాశకు చెందుతారు.

6. కన్యా రాశి

మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. మీ ఇంటికి ఈ రోజు అతిధులు వస్తారు. మీ జీవితం మీకు నమ్మలేని విధంగా అనుభవాలనిస్తుంది. మీ జీవిత భాగస్వామిలో మీరు మరో కోణాన్ని చూస్తారు . మీకు బాగా ఇష్టమైన వారితో ఈ రోజు రాత్రి అంతా మాట్లాడుతారు . మీ జీవితం గురించి వారితో మాట్లాడతారు .

7. తుల రాశి

మీకు ఈ రోజు ఇంత వరకు దొరకని ఆశీస్సులు , అదృష్టాలు కలిసి వస్తాయి. అతిదులతో ఆనందంగా గడుపుతారు. మీ పనులను పూర్తి చేయని కారణంగా మీరు కోపం తెచ్చుకుంటారు . ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని మీ పనుల కొరకు ఉపయోగిస్తారు . ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం ఒక స్పెషల్ చేస్తారు.

8. వృశ్చిక రాశి

మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీ యొక్క వస్తువులు దొంగతనానికి గురి అవుతాయి. మీ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి . మీరు కుటుంబంతో మీ సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబంలో చిన్నవారిని దగ్గరకు తీసుకోండి. మీ శ్రీమతితో ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు దాన, ధర్మాలు చేయండి .

9. ధనస్సు రాశి

మీరు ఏ విషయానికి కూడా ఆందోళన పడకండి . మీరు ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు . ఈ రోజు పెట్టుపడులు గురించి ఆలోచిస్తారు. మీరు తెలియకుండా టెన్షన్ పడుతూ ఉంటారు . మీ జీవితం కొంత కష్టంగా మారుతుంది . వైవాహిక జీవితం మీ ఆనందానికి కొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. మీ వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి .

10. మకర రాశి

ఇంటి వద్ద పని చేసేటప్పుడు , ప్రత్యేక శ్రద్ధ పెట్టండి .
మీరు ఈ రోజు వ్యాపారవేత్తలను కలుకుంటారు . మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి . ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు . అది కూడా మీ మంచికె అని ఆలస్యంగా గుర్తిస్తారు. మీ కోపాన్ని తగ్గించుకోవాలి . అది మీకు చాలా మంచిది .

11. కుంభ రాశి

మీరు సరియిన నిర్ణయాన్ని తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో మీ సమయాన్ని గడుపుతారు . వాళ్ళ కోసం సహాయం కూడా చేస్తారు. మీ కుటుంబ సభ్యులను డిమాండ్ చేయకండి . మీరు ఈ రోజు దుఃఖానికి గురి అవుతారు . రాత్రి సమయంలో మీతో మీరు సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది . మీరు కోపాన్ని చాలా తగ్గించుకోవాలి . అది మీకు చాలా మంచిది .

12. మీనా రాశి

ఈ రోజు మీకు మీరే మొటివాట్ చేసుకుంటారు. మీ దగ్గరకు బిజినెస్ అప్పు కోసం వస్తారు. కానీ మీరు వాళ్ళకి సహాయం చేయలేరు . మీ కుటుంభ సభ్యులతో మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రవర్తన వలన మీలో కొత్త మార్పులు వస్తాయి.
మీకు ఇష్టమైన వారితో మీ మనసులో ఉన్న మాటను వారికి చెప్పండి . ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు .

Exit mobile version