Horoscope May 15 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది. అందుకోసం యోగా చేయడం ఉత్తమం. దైవచింతన అలవర్చుకోవాలి.
వృషభం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఉన్నతాధికారులతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలి. రుణాలను కొంతవరకు తీరుస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి.
మిథునం: ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధించే ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావొచ్చు. శుభకార్యాలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వేంకటేశ్వరుడిని పూజించాలి.
కర్కాటకం: ఈ రాశి వారికి అనుకూలం. మిత్రులతో కలిసి ఉంటారు. యాత్రల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలపై ఆకర్షితులవుతారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఇష్టమైన దేవుడిని పూజించాలి.
సింహం: ఈ రాశి వారికి శుభప్రదం. ఆకస్మిక మార్పులు జరుగుతాయి. ముఖ్యమైన రంగాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కళా, సాహిత్య రంగాల్లోని వారికి అనుకూలం. అభివృద్ధిపై ఫోకస్ ఉంచుతారు. శ్లోకాలు చదివితే మంచిది.
కన్య: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. సంతానం కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్వల్పంగా లాభాలు అందుతాయి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లక్ష్మీదేవిని ఆరాధించాలి.
తుల: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. మీతో ఉండి మోసం చేసే వారిపై తెలివిగా వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సమస్యలు వచ్చినా వెనకాడకుండా ముందడుగు వేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివుడిని పూజించాలి.
వృశ్చికం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. కీలక విషయాలపై కఠినంగా వ్యవహరిస్తారు. దైవచింతన ఉంటే మంచిది.
ధనుస్సు: ఈ రాశి వారికి మంచి ఫలితాలు. ప్రణాళికతో పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఉంటారు. భవిష్యత్తుపై మంచి విజన్ ఉంటుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకపోవడం మంచిది. పుస్తకపఠన అలవర్చుకోవాలి.
మకరం: ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలపై శ్రద్ధ అవసరం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు సైతం పరిష్కరిస్తారు. లాభాలు మరింత పెరగవచ్చు. ఇతరులకు సూచనలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు.
కుంభం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అనవసరమైన విషయాలపై ఆలోచన చేయవద్దు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కోపాన్ని త్యజించాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, బదిలీలు ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు స్వల్పంగా పెరగవచ్చు.
మీనం: ఈ రాశి వారికి అనుకూలం. సంతానం కలుగుతుంది. అన్ని రంగాల వారికి లాభాలు వరిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సహాయం తీసుకుంటారు. అనవసరమైన విషయాలపై ఆచితూచి అడుగులు వేయాలి. ఆంజనేయ స్వామివారిని సందర్శించుకుంటే మంచిది.