Site icon Prime9

Ekadashamsha Yoga 2025: ఏకాదశాంశ యోగంతో.. ఏప్రిల్ 19 నుండి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Ekadashamsha Yoga 2025

Ekadashamsha Yoga 2025

Ekadashamsha Yoga 2025:  హిందూ మతం.. జ్యోతిష్య శాస్త్రంలో పదకొండు సంఖ్య చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంఖ్యకు అధిపతి విష్ణువు. ఒక జాతకంలో రెండు గ్రహాల మధ్య కోణం సుమారు 32.73 డిగ్రీలు ఉన్నప్పుడు.. ఈ ప్రత్యేక కోణీయ సంబంధాన్ని ఏకాదశాంశ లేదా జ్ఞానమాంస యోగం అంటారు.

ఇది జ్యోతిష్యశాస్త్రంలో ముఖ్యమైన కలయిక ఇది గ్రహాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ యోగాన్ని ‘ఏకాదశ యోగం’ అంటారు. ఏప్రిల్ 18, 19 తేదీలలో సూర్యుడు, శుక్రుడు, శని కలిసి ఈ యోగాన్ని సృష్టించబోతున్నారు. ఇది అరుదైన యోగం. ఇప్పుడు ఏకాదశాంశ యోగం ఎందుకు ముఖ్యమో, ఏ రాశి వారిపై దీని ప్రభావం ఉంటుందో తెలుసుకుందామా..

మేష రాశి రాశి: ఏకాదశాంశ యోగం కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని సూచిస్తోంది. సూర్యుడు, శని సంయోగం మీ పని జీవితంలో కొత్త శక్తిని నింపుతుంది. తద్వారా మీరు మీ లక్ష్యాల పట్ల మరింత దృష్టి కేంద్రీకరించి అంకితభావంతో ఉన్నట్లు భావిస్తారు. మీ ఆఫీసుల్లో విజయం సాధించడానికి ఇది మీకు సరైన సమయం. శుక్రుడి అనుగ్రహంతో.. మీరు సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు. అంతే కాకుండా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఏ విషయం పట్ల అయినా మీరు తొందరపడకుండా ఉండాలి. వీలైతే ఓపికగా పని చేయాలి. మీరు ఓపిక పెడితే.. దీర్ఘకాలిక విజయాలను పొందుతారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఏకాదశాంశ యోగం బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. శుక్రుడు , శని కలయిక కొత్త ఆదాయాకు అవకాశం కల్పిస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం , సామరస్యం కూడా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో మీ సమన్వయం మెరుగుపడుతుంది. మీ సంబంధాల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. అదనంగా.. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతర్గత సంతృప్తి , మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ సమయం మీ జీవితాన్ని సమతుల్యంగా, ఆహ్లాదకరంగా మార్చగలదు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి.. ఏకాదశ యోగం ఆనందాన్ని, కుటుంబ సంబంధాలలో మెరుగుదలను సూచిస్తుంది. మీ కుటుంబంతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇదే మంచి సమయం. సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. మీ పనిలో సహాయకారిగా నిరూపించే కొత్త సహచరులను మీరు కనుగొంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా మీరు అందుకుంటారు. ఇది ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తుంది. మీ మానసిక వైఖరి సానుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి: కుంభ రాశి వారికి.. ఏకాదశాంశ యోగం ఆఫీసుల్లో విజయాన్ని సూచిస్తుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. మీ పని ద్వారా మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ఈ సమయంలో సాంకేతిక రంగంలో ప్రత్యేక విజయం సాధించే అవకాశం కూడా ఉంది. శని అనుగ్రహంతో.. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. అంతే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. మీ సామాజిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి, కొత్త అవకాశాలను గుర్తించడానికి ఇది మీకు సమయం.

Exit mobile version
Skip to toolbar