Site icon Prime9

Horoscope: నేటి రాశి ఫలాలు (22 అక్టోబర్ 2022)

daily horoscope details

daily horoscope details

ఈ రోజు అన్ని రాశుల శుభదినంగానూ, లాభదాయకంగా ఉంటుంది. మీ జీవితంలో సంతోషం కోసం కాస్త సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం చెప్పదగిన సూచన.

1. మేష రాశి

ఒత్తిడిని  తగ్గించుకోవడానికి   యోగా చేయాలిసి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి  టెన్షన్ పడకండి . నిరాశ నిస్పృహలను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రిగారి సలహాలు తీసుకోవడం వల్ల  మీకు మంచి  కలుగుతుంది.ప్రయోజనాన్ని  చేకూరుస్తాయి.మీరు బాగా  నమ్మిన వారు మిమ్మలని మోసం చేసే అవకాశం ఉంది.ఎదుటివారిని  ఒప్పుకునేలా  చేయగల మీ  నేర్పు   రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది.

2.వృషభ రాశి

మీ అభిప్రాయాలను చెప్పడానికి సిగ్గుపడకండి. మీ సమస్యలు పరిష్కరించడం కోసం మీ మనస్సు  ప్రశాంతంగా ఉంచుకోండి.ఈ  రోజు మీరు  ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం వల్ల మీరు  కాస్త ఇబ్బంది పడవచ్చు.ఈ  రోజు  మీరు  మీ యొక్క స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు మీకు ఇష్టమైన   ప్రదేశాలకు వెళతారు.

3.మిథున రాశి

ఈరోజు,మీయొక్క ఆరోగ్యము మీకు సహకరిస్తుంది .డాని వలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు.మీ దగ్గర డబ్బు తీసుకొని, ఇప్పటికి మీకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి సమస్యలు తలెత్తుతాయి.పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ భాగస్వామితో మీరు సంతోషంగా గడుపుతారు అదే సమయంలో  రొమాంటిక్ విషయాల గురించి  మాట్లాడుకుంటారు. మీరు మీకు ఇష్టమైన పాటలను వినటం, టీ కన్నా,కాఫీ కన్నా ఆహ్లదాన్ని ఇస్తుంది.

4. కర్కాటక రాశి

ఈ రోజు మీకు ఆర్ధిక లావాదేవీలు కలసివస్తాయి. ఉద్యోగులకు తగిన ప్రశంసలు అందుతాయి. ఈ రోజు మీరు మీ భాగస్వామితో క్యాండిల్ లైట్ డిన్నర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం తప్పనిసరి. జీవితంలో ఆనందంగా ఉండడానికి కాస్త మీ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం గడపండి.

5. సింహ రాశి

ఈ రోజు మీకు కాస్త నిరుత్సాహంగా గడుస్తుంది. మీ బంధాలలో ఈ రోజు ఇంకా అగాధాన్ని సృష్టిస్తుంది. తగువలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి పెడితే అవి ఆర్థిక నష్టాలను తెచ్చిపెడతాయి. శారీరక ఆరోగ్యం కోసం ధ్యానం , యోగా చెయ్యడం చెప్పదగిన సూచన.

6. కన్యా రాశి

ఈరోజు విద్యార్థులకు కాస్త నిరుత్సాహం కలుగుతుంది, ఆర్థిక సంబంధ లావాదేవీలు మీ ఇంట్లో లేనిపోని గొడవలను సృష్టిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఈ రోజు అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు వస్తాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు ఎక్కువ టెన్షన్ కు లోనవుతారు. మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబ సహాయం పొందండి. అది మీకు ఎంతో సాంత్వనను ఇస్తుంది. మీ సానుకూలతావాదం తోను, మీపై మీకుగల నమ్మకంతోను, ఇతరులను మెప్పించగలరు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

ఈరోజు మీకు అనుకున్నంతగా డబ్బు చేతికందదు. తత్ఫలితంగా కాస్త ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు మీ స్నేహితులతో పార్టీలకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం వల్ల మీరు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.

10. మకర రాశి

ఈ రోజు ఈ రాశివారికి మంచి తెలివితేటలు ఉంటాయి. వారిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ రాశివారికి ఈ రోజు అనేక మార్గాల నుండి ఆర్థిక లాభాలు వస్తుంటాయి. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

11. కుంభ రాశి

చిన్న విషయాలకు చీకాకు పడకండి. ఈ రోజు ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
ఈ రోజుంతా మీ మూడ్ చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి

ఈ రోజు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు మీ కుటుంబ సభ్యులు సహాయపడతాయి. ఈరోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తారు. దీని వలన మీరు మానసిక తృప్తిని పొందగలరు. పొరుగు వారితో తగాదా పడే అవకాశం ఉంది అది మీ మూడ్ ని పాడు చేస్తుంది. ఈ రోజు మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

Exit mobile version