Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం సెప్టెంబర్ 29 ,2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today: అన్ని రాశుల వారికి ఈ రోజుగా అనుకూలంగా ఉంది.  ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది. ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు. అనుకోకుండా మీ బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈ రాశికి చెందిన వారు అనుకున్న వాటిని సాధిస్తారు.

Horoscope Today:  రాశి ఫలాలు (బుధవారం సెప్టెంబర్ 29 ,2022)

1.మేష రాశి

ఈ రోజు శ్రమ పడాలిసి ఉంటుంది.ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతుంది.రియల్ ఎస్టేట్ లో డబ్బును పెట్టబడిగా పెడతారు.మీ కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం వలన వేడుకలకు జరుపుకుంటారు.మీ ప్రియమైన వారి మీద ఈ రోజు మీ ప్రేమను కురిపిస్తారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చెప్పే అబద్ధం మిమ్మల్ని బాగా అప్ సెట్ చేయవచ్చు.

2 .వృషభ రాశి

మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

3. మిథున రాశి

మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి.ఆరోగ్య సమస్యల వల్ల కొత్త బాధలు వస్తాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.ప్రతి క్షణం ప్రేమ, ప్రేమ అని జపించకండి ?ఎందుకంటే మీ ప్రేమ దూరం ఐతే మీరు తట్టుకోలేరు.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4. కర్కాటక రాశి

మీరు ఈ పని చేసిన మీ ఇంట్లో వారికి చెప్పి చేయండి .. లేదంటే అడ్డంకులు రావచ్చు. అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు.అస్తమానం మీ ప్రియురాలి గురించే ఆలోచించకండి.ఈ రాశికి చెందిన వారు పాత స్నేహితులతో సినిమాకు వెళ్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మాటల యుద్ధం తప్పదు కాబట్టి కొంచం సైలెంటుగా ఉండటం మంచిది.

5. సింహ రాశి

పని చేసే దగ్గర ఒత్తిడి తప్పదు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు చాలా చురుకుగా ఉంటారు.అప్పు కోసం వచ్చిన వారికి మీ సహాయం అందుతుంది. గతంలో మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి కొంచం సమయం తీసుకొని శాంతంగా ఆలోచించండి. మీకు, మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు.

6. కన్యా రాశి

మీ కుటుంబ సభ్యుల మాటలకి మీకు చిరాకు వస్తుంది దీని వల్ల మీరు ఒత్తిడికి గురై ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటారు.పని చేసే దగ్గర ఒత్తిడి తప్పదు. మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో అనుమతి తీసుకొని చేయండి.మీ నోటి నుంచి ఈ మాట వచ్చిన దాన్ని అంగీకరిస్తారు.మంచి ఆరోగ్యం కోసం రోజూ బాదం తింటూ ఉండండి.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

7. తులా రాశి

ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి.ఈ రాశి వారికి వ్యాపారం బాగా కలిసి రానుంది. సమయాన్ని వృధా చేయకండి. సమయం చాలా విలువైనది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మీ సమయాన్ని, మీ కుటుంబానికి మీ కొరకు కేటాయించండి.
మీ జీవిత భాగస్వామిని బయటకు తీసుకెళ్ళి ఆమెకు నచ్చినవి కొనిపెడతారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీ స్నేహితులతో గొడవ పడతారు.ఆరోగ్యం బావుంటుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించకండి. మీ కింద పని చేసే వారి వల్ల మీకు చిరాకు వస్తుంది. డబ్బును ఎక్కువుగా ఖర్చు పెట్టకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.
ఎప్పుడు పని మీదే ధ్యాస పెట్టకండి. అప్పుడప్పుడు మీతో మీరు సమయాన్ని గడపండి.
ప్రతి చిన్న దానికి కోపం తెచ్చుకోకండి ? శాంతంగా ఆలోచించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీద మీకు బాగా కోపం వస్తుంది.

10. మకర రాశి

ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేయాలిసి ఉంటుంది. డబ్బు యొక్క విలువను మీరు తొందరలోనే తెలుసుకుంటారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీ జీవిత భాగస్వామికి, మీకు గొడవలు జరగవచ్చు.

11. కుంభ రాశి

ఆరోగ్య సమస్యల వల్ల కొంచం దిగులుగా ఉంటారు.బయట ఫుడ్స్ తగ్గిస్తే మీ ఆరోగ్య సమస్యలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.ఈ రోజు మీకు నచ్చిన పనిని చేస్తారు.ఎవరు ఎన్ని చెప్పిన మీ ప్రేమ మిమ్మల్ని విడిచి పెట్టి వెళ్ళదు.ఈ రాశికి చెందిన వారు పని చేసే ఆఫీసులో మంచి పేరును సంపాదించుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

గర్భం దాల్చిన వాళ్ళు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో విలువ మీకు తెలిసి రానుంది.ఆరోగ్య బాధలు తప్పవు.ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు స్నేహితులతో కలిసి బయటకు వెళతారు. మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Exit mobile version