Horoscope Today : రాశి ఫలాలు (గురువారం సెప్టెంబర్ 22 ,2022)

మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను నుంచి బయట పడతారు.మీరు ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యుల సూచనలను పాటించండి.ఈ రోజు మీ భాగస్వామి మాటలకు మీరు ఆమె ప్రేమలో పడిపోతారు.మీ ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఈరాశికి చెందినవారు వారితో వారు కొంత సమయాన్ని గడుపుతారు.ఆఫీసులో పనిఒత్తడి వలన చిరాకుగా అనిపిస్తుంది.ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 07:00 AM IST

Horoscope Today : రాశి ఫలాలు (గురువారం సెప్టెంబర్ 22 ,2022)

1. మేష రాశి

మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను నుంచి బయట పడతారు.మీరు ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యుల సూచనలను పాటించండి.ఈ రోజు మీ భాగస్వామి మాటలకు మీరు ఆమె ప్రేమలో పడిపోతారు.మీ ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఈరాశికి చెందినవారు వారితో వారు కొంత సమయాన్ని గడుపుతారు.ఆఫీసులో పనిఒత్తడి వలన చిరాకుగా అనిపిస్తుంది.ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2.వృషభ రాశి

ఈ రోజు కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి అంత మాత్రాన మీరు ధైర్యాన్ని కోల్పోకండి.పరిస్థితిలు మారే వరకు శాంతంగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి వస్తుంది. డబ్బును అవసరానికి మాత్రమే ఖర్చు చేయండి.ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ ప్రియురాలి చేసే పనికి మీకు బాగా కోపం వస్తుంది.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

3.మిథున రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.
ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు చేయాలనుకున్న పనులు వాయిదా పడతాయి.ఈ రోజు మీ జీవితం భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

4.కర్కాటక రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మీకు డబ్బు విలువ తెలిసి రానుంది.మీ కోసం డబ్బును ఖర్చు పెట్టండి ,పరులు కోసం కాదు?
మీ దాచి పెట్టిన డబ్బు మీకే ఉపయోగపడుతుంది.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.మీ వైహహిక జీవితంలో మీరు ఉహించలేని విధంగా మార్పులు రానునున్నాయి.

5. సింహ రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థిక సమస్యలు ఈరోజు తొలగిపోతాయి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు,వారి రాక మీ జీవితంలో కొత్త మార్పులను తేనున్నాయి.మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు.

6. కన్యా రాశి

పరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి,అందరూ మీ వాళ్లే అని నమ్మకండి తరువాత వారు చేసే మోసాన్నితట్టుకోలేరు.పెట్టుబడులు
పెట్టెటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పాత స్నేహితులను కలుసుకుంటారు.ప్రముఖులతోను పరిచయాలు పెంచుకుంటారు.ఈ రోజు మీకు ,మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు.

7. తులా రాశి

ఈ రోజు శుభవార్తలు వింటారు. మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్యలు రావచ్చు ,వారి కోసం డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలిసి ఉంటుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు చేసే సహాయానికి మీకు మంచి పేరు వస్తుంది.గతంలో మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

చెడు అలవాట్లను తొందరగా మానేయండి..లేకపోతే మీ ఆస్తులను అమ్ముకోవాలిసి ఉంటుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. స్నేహితులను పిలిచారు కదా అని ఎక్కడికి వెళ్ళకండి…వాళ్ళు మిమ్మల్ని మాయ చేసి..మీ డబ్బునంతా ఖర్చు పెట్టిస్తారు.ఈ రోజు మీ వైవాహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారనుంది.

9. ధనస్సు రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే మీ జీవిత భాగస్వామికి మీ సమస్యలను చెప్పి పరిష్కరించండి.మీరు చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రానున్నాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

10. మకర రాశి

ఈ రోజు మీ చిన్న నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయిస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు కలిసి రానుంది.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం వల్ల మీరు ఆందోళనకు గురవుతారు.

11. కుంభ రాశి

ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.ఈ రోజు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు.మీ స్నేహితులను కలుసుకుంటారు.మీ జీవితంలో ఆకస్మిక మార్పుల వలన మీరు కొత్త ఇబ్బందులను ఎదుర్కొవాలిసి ఉంటుంది.మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.