Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు (శనివారం అక్టోబర్ 08, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు (శనివారం అక్టోబర్ 08, 2022 )

1. మేష రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. మీ అప్పు మీకు తిరిగి వస్తుంది. మీ స్నేహితులను కలుసుకుంటారు. మీ జీవితం గురించి ఒకసారి ఆలోచించుకోండి. సరియైన సమయంలో మీ పనులన్ని పూర్తి చేస్తారు. పెళ్ళి గురించి సరియైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రోజు మీరు పెద్ద సమస్య నుంచి బయట పడతారు.  మీ వైవాహిక జీవితం  మీకు అందంగా మారబోతుంది.

2 . వృషభ రాశి

మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలిసిన పరిస్థితులు వస్తాయి.మీలో ఒక కొత్త మార్పు వస్తుంది. ఈ మార్పులు వల్ల మీ జీవితం మారే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఖాళీ సమయాన్ని మీకు కేటాయించండి. మీ జీవిత భాగస్వామి పట్ల చాలా శ్రద్దగా ఉంటారు.

3. మిథున రాశి

మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు చేయలకున్న పనులు ఎవరికి చెప్పకండి. ఒక వేళ ఎవరికైనా చెప్తే మీ పనులు ముందుకు వెళ్లవు. ఈ రోజు మీతో మీరు కొంత సమయాన్ని గడువుతారు. మీ వైవాహిక  జీవితంలో  మీరు ఆనందంగా ఉంటారు.  ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కొత్తగా కనిపిస్తుంది.

4. కర్కాటక రాశి

పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితులతో మీ బాధలను పంచుకోండి. నమ్మకమైన స్నేహితులు మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న ఫలితాలు రావు. మీ బంధువులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి . ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

5. సింహ రాశి

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎంత బిజీ గా ఉన్న మీ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోతారు . మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడుతుంది . మీ భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండండి.

6. కన్యా రాశి

ఈ రోజు మీరు హుషారుగా ఉంటారు. మీ పనిలో ఈ రోజు మునిగిపోతారు . మీ సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి . మీకు ఈ రోజు ప్రశాంతత దొరుకుతుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది . పెళ్ళి గురించి ఆలోచన చేస్తారు.

7. తుల రాశి

మీరు ఎన్ని బాధల్లో ఉన్నా చిరునవ్వు చెరగదు. డబ్బులు ఎలా పొదుపు చేయాలో నేర్చుకోండి. మీ కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి. మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. మీరు చేయలకున్న పనులను కొన్ని కారణాల వల్ల చేయలేరు. మీ వైవాహిక జీవితం అందంగా ఉండబోతుంది.

8. వృశ్చిక రాశి

మీ తల్లిదండ్రులుతో సంతోషంగా గడుపుతారు. మీ జీవితం మీకు ఒకటి నేర్పబోతుంది. ఆడ పిల్లలను గౌరవించండి . మీ జీవితంలో మీరు చాలా బాధలు పడాలిసి వస్తుంది. మీ భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు . మీ వైవాహిక జీవితం మీకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది.

9.ధనస్సు రాశి

మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మీ భాగస్వామి సాయం తీసుకుంటారు. మీరు అనుకున్న పనులు చేయడానికి ఇదే మంచి అవకాశం . ఈ రోజు మీకు గుర్తు ఉండిపోతుంది.
మీకు ఇష్టమైన వారికి మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

10.మకర రాశి

మీ ప్రవర్తనలో కొత్త మార్పులు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో మీ బాధలను పంచుకుంటారు. మీ ఇంటికి అతిధులు అనుకోకుండా వస్తారు. మీ సమస్యలకు పరిష్కారం నెమ్మదిగా దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి మీతో కొత్తగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఉండటం మీకు మంచిదే.

11.కుంభ రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. డబ్బును బాగా పొదుపు చేయండి. ముందు ముందు మీకు డబ్బు చాలా నేర్పిస్తుంది. మీ జీవితంలో డబ్బు వల్ల ఇబ్బందులు తప్పవు. కొత్త పనులను ప్రారంభిస్తారు . అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది. మీ భాగస్వామి మీకు ఈ రోజు దేవత లాగా కనిపిస్తుంది.

12. మీన రాశి

మీతో పని చేసే వాళ్ళు మిమ్మల్ని పనిలో ఇబ్బంది పెడ్తారు . మీరు డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆలోచించండి. మీ కుటుంబతో మీ బాధలను చెప్పుకుంటారు. మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. మీ స్నేహితులతో మాటలు తగ్గించుకోండి. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

 

Exit mobile version