Horoscope Today : రాశి ఫలాలు ( సోమవారం సెప్టెంబర్ 19 ,2022 )
1. మేష రాశి
జీవితం విలువ తెలుసుకొని కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతారు.మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ తల్లిదండ్రులకు చెప్పి, ఆ తరువాత నిర్ణయం తీసుకోండి.అలా చేయని పక్షాన మీ తల్లిదండ్రులతో విబేధాలు రావచ్చును. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కొరకు సమయాన్ని కేటాయించండి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
2 . వృషభ రాశి
కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీరు ఒక కొత్త అనుభూతిని పొందనున్నారు.ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి.ఈ రోజు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటికి తీసుకెళ్ళి నచ్చనవి కొనిస్తారు.
3. మిథున రాశి
ఆరోగ్య సమస్యల వల్ల కొంచం దిగులుగా ఉంటారు.బయట ఫుడ్స్ తగ్గిస్తే మీ ఆరోగ్య సమస్యలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.ఈ రోజు మీకు నచ్చిన పనిని చేస్తారు.ఎవరు ఎన్ని చెప్పిన మీ ప్రేమ మిమ్మల్ని విడిచి పెట్టి వెళ్ళదు.ఈ రాశికి చెందిన వారు పని చేసే ఆఫీసులో మంచి పేరును సంపాదించుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
4. కర్కాటక రాశి
చెడు అలవాట్లను తొందరగా మానేయండి లేదంటే మీరు చాలా కోల్పోవాలిసి ఉంటుంది.అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు.అస్తమానం మీ ప్రియురాలి గురించే ఆలోచించకండి.ఈ రాశికి చెందిన వారు పాత స్నేహితులతో సినిమాకు వెళ్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మాటల యుద్ధం తప్పదు కాబట్టి కొంచం సైలెంటుగా ఉండటం మంచిది.
5. సింహ రాశి
ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.అప్పు కోసం వచ్చిన వారికి మీ సహాయం అందుతుంది.గతంలో మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు.మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి కొంచం సమయం తీసుకొని శాంతంగా ఆలోచించండి.మీకు, మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు.
6. కన్యా రాశి
మీ కుటుంబ సభ్యుల మాటలకి మీకు చిరాకు వస్తుంది దీని వల్ల మీరు ఒత్తిడికి గురై ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటారు.మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో అనుమతి తీసుకొని చేయండి.వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే ఒక సారి పోగొట్టుకున్న అవకాశం మళ్ళీ రాదు.మంచి ఆరోగ్యం కోసం రోజూ బాదం తింటూ ఉండండి.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
7. తులా రాశి
డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి.మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి.వ్యాపారం కలిసి రానుంది. సమయాన్ని వృధా చేయకండి.సమయం చాలా విలువైనది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మీ సమయాన్ని,మీ కుటుంబానికి మీ కొరకు కేటాయించండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
8. వృశ్చిక రాశి
ఆరోగ్యం బావుంటుంది.మీ కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించకండి.మీ కింద పని చేసే వారి వల్ల మీకు చిరాకు వస్తుంది. డబ్బును ఎక్కువుగా ఖర్చు పెట్టకండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
9. ధనస్సు రాశి
అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఎప్పుడు పని మీదే ధ్యాస పెట్టకండి.అప్పుడప్పుడు మీతో మీరు సమయాన్ని గడపండి.
ప్రతి చిన్న దానికి కోపం తెచ్చుకోకండి ? శాంతంగా ఆలోచించండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీద మీకు బాగా కోపం వస్తుంది.
10. మకర రాశి
ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేయాలిసి ఉంటుంది.డబ్బు యొక్క విలువను మీరు తొందరలోనే తెలుసుకుంటారు.మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.మీ జీవిత భాగస్వామికి,మీకు గొడవలు జరగవచ్చు.
11. కుంభ రాశి
మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి.ఆరోగ్య సమస్యల వల్ల కొత్త బాధలు వస్తాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.
పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.ప్రతి క్షణం ప్రేమ ,ప్రేమ అని జపించకండి ?ఎందుకంటే మీ ప్రేమ దూరం ఐతే మీరు తట్టుకోలేరు.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
12. మీన రాశి
మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రబోతున్నారు.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.