Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు ( ఆదివారం అక్టోబర్ 2, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( ఆదివారం అక్టోబర్ 2, 2022 )

1.మేష రాశి

ఆరోగ్య బాధల నుంచి బయటపడతారు ఐనా కూడా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఆఫీసులో మీరు చేసే పనికి మెచ్చుకుంటారు.ఒకరు చెప్పే సలహాలను తీసుకోండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2.వృషభ రాశి

మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే మీకు మంచి lలాభాలు ఉంటాయి.మీ  స్నేహితులతో కలిసి సినిమాలకు వెళతారు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.డబ్బు విలువ తెలుసుకుంటారు.మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది.ఈ రోజు మీరు చేయాలనుకున్న పనులన్ని చేస్తారు.ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు.మీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి.మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ప్రయాణం చేయాలిసి ఉంటుంది.

3. మిథున రాశి

మీరు అనారోగ్యంగా ఉన్నారని  దిగులు పడకండి.మీ కుటుంబం కోసం కష్ట పడి పని చేస్తారు.ఈ రోజు మీ జీవిత స్వామితో  సంతోషంగా గడుపుతారు.ఈ రోజు మీ ప్రియమైన వారితో  మీ సమయాన్ని కేటాయిస్తారు.మీ కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా నష్టపోతారు.మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీరు ఏదైనా పని చేసే ముందు మీ తల్లి దండ్రులకు చెప్పి  చేయండి.

4. కర్కాటక రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఈ రోజు మీ సమయాన్ని నిద్రకు కేటాయిస్తారు. ఈ రాశికి చెందిన వారికి ఖాళీ  సమయం  దొరుకుతుంది.గాలిలో మేడలు ఎలా కట్టాలి అని కాకుండా ఆలోచనలకు పదును పెట్టి ఆలోచించండి.ఈ రోజు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితుల వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి.ప్రతి రోజు ప్రేమ గురించే ఆలోచించకండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటకు తీసుకెళ్ళి  తనకి  ఇష్టమైనవి  కొనిపెడతారు.

5. సింహ రాశి

ఈ  రాశికి చెందిన వారు ఈ రోజు  సంతోషంగా ఉంటారు.ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయాలిసి ఉంటుంది.మీరు డబ్బును బాగా పొదుపు చేయాలి.మీ ప్రేమను గెలుపించుకోవడానికి ఇదే మంచి అవకాశం.ఈ రోజు కొత్త వ్యక్తులను మీ జీవితంలోకి రాబోతున్నారు.ఈ రోజు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి  సంతోషంగా గడపనున్నారు.

6. కన్యా రాశి

ఈ రోజు మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోండి.మీ ప్రేమ ఫలించదు.దానికి మీరు చాలా బాధ పడతారు. మీ వైవాహిక జీవితలో కొత్త సమస్యలు వస్తాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.

7. తులా రాశి

ఇంట్లో మీ వల్ల బాధలు పడతారు.ముందు మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది.మీ కుటుంబ సభ్యులు చెప్పేది వినండి ఇప్పుడు వినకపోతే తర్వాత చెప్పే వాళ్ళు కూడా ఉండరు. మీ జీవితంలో ఎదురు దెబ్బలను బాగా తగులుతాయి.మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు ఆఫీసు నుంది వచ్చిన  తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు.మీ జీవితంలో  మీరు అనుకోని మార్పులు సంభవిస్తాయి.అది మీ ఆరోగ్యం మీద పడుతుంది.ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడాలంటే ముందు మీరు మారాలి. జరిగే పనులు బాగా ఆలోచించకండి.మీరు ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఏది ఆగదు.కష్ట పని చేయడం నేర్చుకోండి.మీ వైవాహిక జీవితం మారుతుంది.

9. ధనస్సు రాశి

మానసిక ఒత్తిడి తగ్గుతుంది.డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకండి.మీ ప్రేమ ప్రయాణంలో కొత్త చిక్కులు వస్తాయి.ఇతరుల విషయాలను పట్టించుకోకండి.మీ పనుల మీద ధ్యాస పెట్టి చేయండి.మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

10. మకర రాశి

మీరు పని చేసే దగ్గర గుర్తింపు రావాలంటే మీరు ఇంకా కష్ట పడలిసి ఉంది.మీ స్నేహం ప్రేమగా మారిపోయే అవకాశం ఉంది.మీ ఖాళీ సమయాన్ని మీకు నచ్చిన పనులు చేయడానికి ఉపయోగించుకుంటారు.అనుకోని అతిధులు మీ ఇంటికి వస్తారు.ఆఫీసులో ఈ రోజు మీకు నచ్చి నట్టుగా జరుగుతుంది.

11. కుంభ రాశి

పని ఒత్తిడిని తగ్గించడానికి యోగా,వ్యాయామం చేయాలిసి ఉంటుంది.ఏది ఐన పని చేసే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించండి.ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది.మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.మీ వైవాహిక జీవితం మీకు నచ్చిన విధంగా ఉండదు.

12. మీన రాశి

ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.మీరు డబ్బును ఇంకా పొదుపు చేయాలి.మీరు చేయాలనుకున్న పని పైనే దృష్టి పెట్టండి.ఎవరో ఎదో అనుకుంటారని వెనుకడుగు వేయకండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Exit mobile version