Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు (మంగళవారం సెప్టెంబర్ 20,2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today :రాశి ఫలాలు (మంగళవారం సెప్టెంబర్ 20,2022)

1.మేష రాశి

ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి.ధన లాభం వస్తుంది.మీ కుటుంబలోని చిన్న పిల్లలని దగ్గరికి తీసుకోండి.ఈ రోజు మీరు విలువైన బహుమతులను అందుకుంటారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.అనుకోకుండా మీ ఇంటికి ఈ రోజు బంధువులు వస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2 .వృషభ రాశి

మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.మీ ప్రియమైన వారు మీరు చెప్పేది వినకుండా వాళ్ళకి నచ్చింది చేయడం వల్ల మీకు కోపం వస్తుంది.ఈ రోజు మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది.

3.మిథున రాశి

ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేయాలిసి ఉంటుంది.డబ్బు యొక్క విలువను మీరు తొందరలోనే తెలుసుకుంటారు.మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.మీ జీవిత భాగస్వామికి,మీకు గొడవలు జరగవచ్చు.

4.కర్కాటక రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు. అస్తమానం మీ ప్రియురాలి గురించే ఆలోచించకండి.ఈ రాశికి చెందిన వారు పాత స్నేహితులతో సినిమాకు వెళ్తారు.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

5. సింహ రాశి

డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి.మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి.వ్యాపారం కలిసి రానుంది.సమయాన్ని వృధా చేయకండి.సమయం చాలా విలువైనది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మీ సమయాన్ని, మీ కుటుంబానికి మీ కొరకు కేటాయించండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

6. కన్యా రాశి

ఈ రాశి వారికి రానున్న రోజులు కలిసి రానున్నాయి.ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయి.మీ పనేంటో మీరు చేసుకొని ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళండి.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.అనవసర విషయాలను పట్టించుకోకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.అప్పు కోసం వచ్చిన వారికి మీ సహాయం అందుతుంది.గతంలో మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు.మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి కొంచం సమయం తీసుకొని శాంతంగా ఆలోచించండి. మీకు,మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు.

8. వృశ్చిక రాశి

ఈ రాశి వారికి రానున్న రోజుల్లో మంచి జరగనుంది.అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.మీ వైవాహిక జీవితం అందంగా ఉండబోతుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటికి తీసుకెళ్లి తనకి ఇష్టమైనవి కొని పెడతారు.

9.ధనస్సు రాశి

మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబం కోసం కేటాయించండి.మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది.వేరే వాళ్ళ పనులను మీ తల మీద వేసుకొని,బాధ్యతలు తీసుకోకండి.ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి.మీ ప్రేమ మీకు నిరాశను మిగులుస్తుంది.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

10. మకర రాశి

అనుకోకుండా బయట ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది.ఆరోగ్య సమస్యలనుంచి బయట పడతారు.ఈ రోజు మీకు కలిసి రానుంది.
మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అందరూ మీ వాళ్లే అని గుడ్డిగా నమ్మకండి.ఆఫీసులో మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో సంతోషంగా గడుపుతారు.

11. కుంభ రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే మీ జీవిత భాగస్వామికి మీ సమస్యలను చెప్పి పరిష్కరించండి.మీరు చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రానున్నాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువుతాయి.మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ తల్లిదండ్రులకు చెప్పి,ఆ తరువాత నిర్ణయం తీసుకోండి.మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కొరకు సమయాన్ని కేటాయించండి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Exit mobile version