Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు (శుక్రవారం 28  ,2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు (శుక్రవారం 28  ,2022)

1. మేష రాశి

ఆరోగ్య  సమస్యలు  తగ్గుముఖం  పడతాయి.ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కానుంది. ఆఫీసులో ఈ రోజు చాలా ఆనందంగా ఉంటారు.ఈ  రోజు మీరు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ  రోజు   మీరు ఎక్కవ  సమయాన్ని  నిద్రపోవటానికే కేటాయిస్తారు. ఐనప్పటికి , మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో ఈ రోజు  తెలుసుకుంటారు.ఈ రోజు  మీ వైవాహిక  జీవితంలో  అత్యుత్తమమైన  క్షణాలను   మీ జీవిత భాగస్వామితో  పొందుతారు.

2.వృషభ రాశి

ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు చాలా  బాగుటుంది. అనుకోని  విధంగా  మీ దగ్గరకు ధనం వస్తుంది.  ఎప్పుడు  విచారంగా ఉండకండి. అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది .మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి. ఈ రోజు  మీకు చాలా అనుకూలిస్తుంది. మీకు సన్నిహితంగా ఉండే వారి వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు.  ఈ రోజు మీ జీవితంలో  మర్చిపోలేని రోజు అవుతుంది.

3.మిథున రాశి

మీ చుట్టుప్రక్కల  ఉన్నవారు మీకు సహాయం  చేయడం వల్ల , మీకు చాలా  సంతోషం కలుగుతుంది.  ఈ రోజు మీరు ఆర్ధికంగా దెబ్బ తింటారు. ఈ రోజు మీ ప్రియమైన వారితో గడపాలనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల గడపలేరు. దాని  వల్ల మీ  ప్రియమైన వారు బాధ పడతారు. మీతండ్రిగారిని లేక తండ్రిలాంటివారిని సలహాలు,సూచనలుఅడగండి. ఈ రోజు  మీరు డబ్బును ఖర్చు చేయాలిసి ఉంటుంది.

4.కర్కాటక రాశి

మీ వ్యక్తిగత జీవితం గురించి మీ స్నేహితునితో పంచుకుంటారు.అలాగే వారు ఇచ్చే సలహా కూడా మీకు నచ్చుతుంది. ఈ రోజు మీరు  మీకు ఇష్టమైన వారితో కలిసి  బయటకు వెళతారు. వారితో   మీ విలువైన  క్షణాలను  గడుపుతారు. పెట్టుబడులు పెట్టె వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

5.సింహ రాశి

మీరు అనుకున్న పన్ని  సాధించాలంటే ఇంకా బాగా కష్ట పడాలిసి ఉంటుంది. మీ స్నేహితులకు ఈ రోజు సహాయం చేస్తారు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీకు అనుకోని విధంగా లాభాలు రానున్నాయి.  మీరు ఎంత బిజీగా మీతో మీరు సమయాన్ని గడపండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు

6.కన్యా రాశి

ఆర్ధికంగా మెరుగుపడతారు.ఈ రోజు సమయం విలువ తెలుసుకుంటారు. చిన్న చిన్న విషయాలకు  ఎక్కువుగా బాధ పడకండి. ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంభంతో గడుపుతారు. మీ కుటుంభంతో గడపడం   చాలా ముఖ్యము,ఇది మీరు అర్థంచేసుకోవాలి. ఎక్కువ  ఖర్చులు  పెట్టడం వలన ఈ రోజు మీ జీవిత భాగస్వామితో  గొడవ పడవచ్చు.

7.తులా రాశి

మీరు మంచి పని చేసే ముందు పెద్ద వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ బంధువులు అనుకోకుండా మీ ఇంటికి వస్తారు. మీ ప్రియమైన వారికి మీ ప్రేమ దొరుకుతుంది. మీకు ఇష్టం లేకపోయినా మీరు బయటికి వెళ్ళాలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కోపం వస్తుంది

8.వృశ్చిక రాశి

ఈ రోజు మీకు  కొత్త వ్యక్తిని కలుసుకోబోతున్నారు.ఒత్తిడిని తట్టుకోవడానికి  వ్యాయామం చేయండి.ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కానుంది. ఎంత మంది  వచ్చినా మీ విజయాన్ని ఆపలేరు. మీరు చేయాలనుకున్న పనిని పూర్తి చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.మీ ఖాళీ  సమయములో ఈ రోజు మీరు మీ ఫోనులో ఏదైనా కొత్త సినిమాను చూడటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

9.ధనస్సు రాశి

మీ శ్రమను ఈ రోజే నుంచే మొదలు పెట్టండి. పెండింగ్ ఉన్న సమస్యలకు పరిష్కరించబడాల్సి  ఉంది.   మీరు చేసే ఆఫీసులో ఒత్తిడి, టెన్షన్ కలిగిస్తాయి. మీ పాత స్నేహితులు అప్పు కోసం మీ దగ్గరికి వస్తారు .మీ ప్రవర్తన వలన మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ప్రవర్తన మీకు తెప్పించవచ్చు.

10.మకర రాశి

బయట ఫుడ్స్ తినడం వలన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ రోజు మీతో మీరు  సమయాన్ని గడుపుతారు . ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. అలాగే   మీ జీవిత  భాగస్వామితో మంచి  రొమాంటిక్ మూడ్ లోకి వెళతారు.

11.కుంభ రాశి

ఈ రోజు మీ ప్రియమైన వారి సంతోషం కోసం మీరు ఏమైనా చేస్తారు. ఈ రోజు మీకు అనుకోని విధంగా లాభాలు రానున్నాయి.  ఒత్తిడిని తట్టుకోవడానికి  వ్యాయామం చేయండి. మీరు తినే తిండిని తగ్గించుకోవాలి. మీ బాధను వేరొక స్నేహితునితో పంచుకొని బాధ పడతారు. మీరు ఇంకా కష్టపడలిసి ఉంది.  మీ జీవితాన్ని మార్చుకోవాలిసి ఉంటుంది.బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ వైహహిక జీవితంలో ఆనందంగా  గడపనున్నారు.

12.మీన రాశి

ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి  ఒక మంచి సలహా తీసుకోవడం వలన  మీకు మానసిక వత్తిడి ఎంతగానో తగ్గిస్తుంది. మీ  కుటుంభ అవసరాలను కూడా పట్టించుకోండి. మీ ప్రియమైన వారు మీ వల్ల హర్ట్ అవుతారు. ఈ రోజు  మీ ఆరోగ్యం  సమస్యల నుంచి ఉపశమనం పొందనున్నారు.. మీ ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశికి చెందిన వారికి గ్రహాలు అనుకూలించడంతో ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

 

 

Exit mobile version