Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు ( శుక్రవారం సెప్టెంబర్ 2, 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( శుక్రవారం సెప్టెంబర్ 2, 2022 )

1.మేష రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్ధిక సమస్యలు తగ్గుతాయి. మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయండి.మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తున్నాయి.

2 .వృషభ రాశి

ఈ రోజు అధికంగా ఖర్చు చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు. మీ ప్రేమ ప్రయాణం మొదలు అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సమయాన్ని గడుపుతారు. మీతో మీరు సమయాన్ని గడిపితే
మీరు ఏంటో మీకు అర్థం అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

3.మిథున రాశి

ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలిసి ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది.ఎక్కువ టెన్షన్ పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి. మీ ప్రియమైన వారికి మీ సమయాన్ని కేటాయిస్తారు.ఈ రోజు మీరు అనుకున్న పనులు చేయలేరు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

4.కర్కాటక రాశి

మీ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.మీరు డబ్బును బాగా పొదుపు చేయాలిసి వస్తుంది.ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు.
కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రేమగా ఉంటుంది.

5.సింహ రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. మీరు ఎన్నో సాదించాలిసి ఉంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకండి.వచ్చిన అవకాశాలను చేజార్చుకోకండి.మీ జీవిత భాగస్వామి మీ మాట వినదు. ఈ రోజు మీ వైవాహిక జీవితం మీకు నచ్చినట్టు ఉండదు.

6. కన్యా రాశి

మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.లేదంటే కొత్త చిక్కులు వచ్చి పడతాయి.డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి.మీ కుటుంబతో మీ సమయాన్ని గడుపుతారు.రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అలాగే ప్రేమ కూడా దొరుకుతుంది.

7. తుల రాశి

ఈ రోజు మీకు అందమైన రోజుగా మారుతుంది.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. మీరు అనుకున్న ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు.పరిస్థితులను బట్టి కొన్ని మారుతాయి.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీకు మీరే మొటివేట్ చేసుకుంటారు. ఒత్తిడిని వల్ల కోపం తెచ్చుకుంటారు. ఒత్తిడిని దూరం చేయడానికి యోగ చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నా వాళ్ళని తిరిగి అనకండి. ఆఫీసులో మీ పనికి మంచి పేరు వస్తుంది. మీ భాగస్వామి మీతో గొడవలు పడతారు.

9.ధనస్సు రాశి

ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది. మీ స్నేహితులను కలుసుకుంటారు.మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.మీ వైవాహిక కొత్తగా మారబోతుంతుంది.

10.మకర రాశి

మీ ప్రవర్తనలో కొత్త మార్పులు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ఏదైనా చేసేటప్పుడు ఇంట్లో చెప్పి చేయండి. మీరు ప్రేమలో విఫలం అవుతారు. మీ భాగస్వామి , మీరు బయటికి వెళ్ళాలని ఆగిపోతారు. మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడుతుంది.

11.కుంభ రాశి

ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయాలిసి ఉంటుంది. మీరు ఇంకా కష్ట పడలిసి ఉంది.మీ పిల్లల కోసం డబ్బును దాయాలిసి ఉంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ భాగస్వామికి మీ ప్రేమను తెలియజేస్తారు.

12.మీన రాశి

ఈ రోజు మీకు కొత్త చిక్కులు వచ్చి పడతాయి. మీ జీవితంలో కొత్త వ్యక్తి రాబోతున్నారు.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. మీరు పని చేసే ఆఫీసులో చికాకులు వస్తాయి. ఈ రోజు మీరు అనుకున్న పనులను చేయలేరు.మీ భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది.

Exit mobile version